వైసీపీ అధికార గర్వంతో ప్రతిపక్షాలపై దాడులకు దిగుతుంది. తాజాగా గుంటూరులో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. దమ్మాలపాడు గ్రామంలో ప్రచారానికి వెళ్లిన జనసేన కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు దాడులకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ కార్యకర్తలు రాళ్లతో దాడులకు తెగబడ్డారని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రవర్తన తీరుపై ఈసీకి జనసేన ఫిర్యాదు చేసింది. ఇరు వర్గీయుల మధ్య గొడవల కారణంగా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
Must Read ;- అమరావతి నుంచి.. విశాఖ ఉక్కు వరకు.. రావణ కాష్ఠంలా జగనన్న రాజ్యం!