September 15, 2026 5:15 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ప్రశ్నించటానికే వచ్చామన్న జనసేన.. విశాఖ ఉక్కుపై గళమెత్తేనా

ప్రశ్నించడానికి వచ్చామంటూ ఆవేశపూరితమైన తన ప్రసంగంతో యువతను ఆకట్టుకున్న పవన్ కళ్యాణ్.. ‘జనసేన’ను స్ధాపించి ఏడేళ్లు పూర్తయింది.

February 13, 2021 at 3:18 PM
in Andhra Pradesh, Latest News, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజు.. ఓ గొంతుక ఉవ్వెత్తున ఎగసింది. రాష్ట్ర విభజన జరిగిన తీరును మండుతున్న గుండెతో ప్రశ్నించింది. తెలంగాణ, ఆంధ్రా నాయకులపై నిప్పులు కురిపించింది. జరుగుతున్న పరిణామాలతో ఆవేదనతో ఉన్న ఆంధ్రులకు ఈ గొంతుక కొంత ఓదార్పునిచ్చింది. తమకు అండగా నిలుస్తుందన్న ధైర్యాన్నిచ్చింది. ఆ గొంతుక.. పేరే.. పవన్.

రాష్ట్ర విభజన పరిణామాలతో చలించిపోయిన పవన్.. ఇకపై జనంతోనే ఉంటానంటూ నినదించి మరీ.. ‘జనసేన’ను స్థాపించారు. ఆ రోజున అభిమానులు ఉద్వేగానికి లోనయ్యారు. అన్న చేయలేనిది తమ్ముడు సాధిస్తాడని నమ్మారు. నాడు పవన్ ప్రసంగం విన్న సాధారణ జనం కూడా ‘ఇతడు ఏదో చేస్తాడు’ అనే భావించారు. ఈ ఘటన జరిగి నేటికి సరిగ్గా ఏడేళ్లయింది. నాటి ఆవేశం.. ఈ జనసేనానిలో నేడు ఏమైంది? అప్పటి ఉత్సాహం.. అభిమానుల్లో ఇప్పుడు లేదెందుకు? తప్పెవరిది? ఎక్కడ జరిగింది? కనీసం ఈ దిశగా ఆలోచించే నాయకుడు ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్నాడా? రెండు సాధారణ ఎన్నికలను చూసిన ఆ పార్టీకి నిర్మాణముందా? అసలు సిద్ధాంతమేంటి? విధివిధానాలు ఉన్నాయా?కార్యకర్తలు ఎక్కడ? పవన్, నాదెండ్ల మినహా.. మరో నాయకుడి పేరు చెప్పమంటే.. ఎవరైనా చెప్పగలరా? పార్టీ పెట్టిన నాటి పరిస్థితే (నిర్మాణంలో).. ఏడేళ్ల తర్వాతా కనిపిస్తోందంటే.. లోపం ఎవరిది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నమైనా ఆ పార్టీలో జరుగుతోందా? అంటే.. నిరాశాజనకమైన సమాధానమే వస్తోంది.

నిర్మాణంపై కొరవడిన శ్రద్ధ

జనసేన స్థాపన నాటికే పవన్ కు రాజకీయాల్లో అంతో ఇంతో అనుభవం ఉంది. తన అన్న స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో పవన్ కీలక పాత్ర పోషించారు. యువ రాజ్యం అధినేతగా వ్యవహరించారు. ఆ పార్టీ పతనానికి గల కారణాలపై ఆయనకు అవగాహన ఉండే ఉంటుంది. ఆ అనుభవం నుంచి ఆయన పాఠాలు నేర్చుకునే ఉంటారనుకున్న వాళ్లకు నిరాశే మిగిలింది. అన్న లాగే ఆయనా అభిమానులనే నమ్ముకున్నారు తప్ప.. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టలేదు. అభిమానులు ఓట్లు వేస్తారే తప్ప వేయించలేరు. ఓట్లు వేయించేందుకు ఓ యంత్రాంగం కావాలి. కార్యకర్తలు కావాలి. దీన్ని గ్రహించడంలో ఆయన విఫలమయ్యారు. ఏడేళ్లవుతున్నా.. ఎన్ని ఎదురుదెబ్బలు తింటున్నా.. నేటికీ గ్రామస్థాయిలోకి పార్టీని తీసుకుపోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిర్మాణంపై దృష్టి సారించలేకున్నారు.

వ్యూహాత్మక తప్పిదాలు

ఆది నుంచీ జనసేనను వ్యూహాత్మక తప్పిదాలు వేధిస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి పనిచేయాలన్న పవన్ నిర్ణయం వ్యూహాత్మకంగా సరైనదేనని అందరూ భావించారు. దీని ద్వారా పార్టీ నిలదొక్కుకునేందుకు అవకాశం ఉంటుందని అనుకున్నారు. అన్న లాగా అతి విశ్వాసానికి పోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అంతా భావించారు. టీడీపీ మద్దతుతో ఎన్నో కొన్ని సీట్లు గెలుచుకుంటే.. ఆ తర్వాత క్రమంగా పార్టీ బలపడుతుందని, వ్యూహాత్మకంగా ఆయన నిర్ణయం సరైనదేనని విశ్లేషకులు భావించారు. కానీ, అనూహ్యంగా పవన్.. ఆ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. దీన్ని జనసేన చేసిన అతి పెద్ద వ్యూహాత్మక తప్పిదంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సరే.. ఆ తర్వాతైనా ఆయన జనంలో తిరుగుతూ.. ప్రజాసమస్యలపై పోరాడారా.. అంటే.. అదీ లేదు. ఎప్పుడో ఒక ట్వీట్ తప్ప.. రాజకీయాలతో తనకు అసలు సంబంధమే లేదన్నట్లుగా వ్యవహరించారు. సినిమాల్లో బిజీగా గడుపుతూ ప్రజలకు పూర్తిగా దూరమైపోయారు. కావలసినంత సమయం ఉన్నా.. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో భాగస్వామ్య పార్టీలే ఉన్నా.. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు.  పార్టీ నిర్మాణాన్ని విస్మరించారు. పార్ట్ టైం పొలిటీషియన్ గా మిగిలిపోయారు. దీంతో.. ఆ పార్టీలో పవన్ వీరాభిమానులే తప్ప.. నాయకులు, కార్యకర్తలు లేకుండా పోయారు. నిజానికి ఆ సమయంలో ఉద్యమాలు నడపడానికి పవన్ కు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కేంద్రం విభజన హామీలను విస్మరించింది. ప్రత్యేక హోదాను గాలికి వదిలేసింది. రైల్వే జోన్ ప్రకటించలేదు. బడ్జెట్ లో రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తోంది. వీటిపై భారీ ఉద్యమాలే నిర్మించి ఉండొచ్చు. అలా చేసుంటే.. కచ్చితంగా పవన్.. రాష్ట్రంలో ఓ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేవారు. అలా అందివచ్చిన సువర్ణావకాశాలను ఆయన చేజేతులా జారవిడుచుకున్నారు.

Must Read ;- అమిత్ షాను కలిసిన పవన్ కళ్యాణ్.. ఏమిటీ చర్చ?

అతి అనర్ధదాయకం..

పవన్.. తన బలాన్ని అతిగా ఊహించుకుని టీడీపీ, బీజేపీలపై విమర్శలు కురిపిస్తూ వచ్చారు. ఈ విమర్శల్లో కూడా అవగాహనా రాహిత్యమే ఎక్కువగా కనిపించేది. దీంతో.. ఆయన తరచుగా అభాసుపాలయ్యేవారు.  ఇదే సమయంలో నిత్యం జనంలోనే ఉంటూ.. జగన్ బలం పుంజుకున్నారు. జనసేన మాత్రం అధినేత సహా పట్టించుకేవారే లేక డీలా పడిపోయింది.

కమ్యూనిస్టునంటూ.. లెఫ్ట్ పార్టీలతో జట్టు

ఓ రాజకీయపార్టీ దశాబ్దాల ప్రయాణంలో చేసే తప్పులన్నీ.. జనసేన ఈ ఏడేళ్లలోనే చేసేసింది. తొలుత టీడీపీ, బీజేపీలతో జట్టుకట్టిన ఆ పార్టీ.. తదనంతరం బీజేపీకి పూర్తి విరుద్ధమైన కమ్యూనిస్టులతో జతకలిశారు. తాను తొలి నుంచీ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాడినని చెప్పుకున్నారు. వారితో కలిసే ఎన్నికలకు వెళ్లారు. అంతటా డిపాజిట్లు కోల్పోయారు. చివరకు తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఘోరంగా ఓడిపోయారు. ఓటమి తర్వాత.. వెంటనే మళ్లీ బీజేపీతో కలిసిపోయారు. అవకాశ వాదిగా ముద్ర వేయించుకున్నారు. తనకు కులమతాలు లేవంటూ గతంలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన ఆయన.. ఇప్పుడు ఏమాత్రం సిగ్గు పడకుండా.. మతోన్మాదానికి మద్దతిస్తున్నారు. అదేమంటే.. వ్యక్తిగతంగా తాను కుల మతాలకు దూరం అంటారు. అంటే.. తనకో సిద్ధాంతం, పార్టీకి ఓ సిద్ధాంతం ఉన్నాయా? తన పార్టీ సిద్ధాంతంతో తనే ఏకీభవించరా? అంటే.. సమాధానం ఉండదు. సరే.. తన భాగస్వామ్యపక్షంగా బీజేపీ ఏనాడైనా పవన్ కు గౌరవమిచ్చిందా? అంటే.. అదీ లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి దూరంగా పెట్టింది. కనీసం ప్రచారానికి కూడా ఆహ్వానించలేదు. రాబోయే తిరుపతి ఉపఎన్నికలోనూ తమ అభ్యర్థే పోటీలో ఉంటారని ప్రకటించింది. ఇన్ని అవమానాలు ఎదురవుతున్నా.. ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీని చూసి ఎందుకు భయపడుతున్నారన్నది ఆయన అభిమానులను వేధిస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పటికీ పోరాడేందుకు ఆయన ముందు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మూడు రాజధానులు, స్టీల్ ప్టాంట్ లాంటి సమస్యలపై స్పందించని ఆయన.. విగ్రహాల ధ్వంసంపై మాత్రం స్పందించారు. ఎంత భక్తో..! ఆ భక్తి దేవుళ్ల పైనా.. లేక బీజేపీ పెద్దల పైనా అన్నదే తెలియాలి.

వాస్తవాలు గుర్తించాలి..

ఇప్పుడిప్పుడే పవన్.. వాస్తవాలు తెలుసుకుంటున్నట్లున్నారు. తన బలం ఏ మాత్రమో గ్రహించారు. ట్వీట్లతో కాలక్షేపాన్ని తగ్గించారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. అడపాదడపా రాజకీయ వేదికలపైనా సందడి చేస్తున్నారు. కానీ, పార్టీ నిర్మాణాన్ని మాత్రం ఎందుకనో పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు కార్యకర్తలకు ఇంటర్వ్యూలు, శిక్షణ అంటూ హడావుడి చేసిన ఆయన.. మళ్లీ దాన్ని గాలికి వదిలేశారు. ఇప్పటికే రెండు సార్వత్రిక ఎన్నికలను చూసిన పవన్ కల్యాణ్.. మరో రెండేళ్లలోనే మూడో సార్వత్రిక ఎన్నికలను చూస్తారు. అప్పటిలోగానైనా పార్టీ నిర్మాణంపై దృష్టి పెడతారో.. లేదా ఇలాగే ఊరుకుంటారో చూడాలి. పార్టీ యంత్రాంగం, కార్యకర్తల బలం లేకుండా బరిలోకి దిగితే.. వచ్చే ఎన్నికల్లోనూ మరింత దారుణ పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నది నిర్వివాదాంశం. మహా మహా పార్టీలే బీజేపీ పొత్తుతో నిర్వీర్యంగా మారిపోతున్న వేళ.. అభిమానుల బలం తప్ప వేరే నిర్మాణమేమీ లేని పవన్.. భవిష్యత్తులో బీజేపీ మిత్రత్వాన్ని ఎలా తట్టుకుంటారో చూడాలి.

Must Read ;- అంతా గందరగోళం.. పవన్ ఢిల్లీ టూర్‌లో ఏమి తేలుస్తారో..!

Tags: actor pawan kalyanemployees protest on vizag steel plant privatisationjanasainiksjanasainikulujanasean - vizag steel plant issuejanasean cheif pawan kalyanjanasena about steel plant privatizationjanasena formation dayjanasena partyjanasena party formationjanasena party foundation dayjanasena party supportjanasenani pawan kalyanleotoppawan kalyanpawan kalyan on Vizag Steel Plant Privatizationpawan kalyan party janasenapawan kalyan questioning on Vizag Steel Plant PrivatizationVizag Steel Plantvizag steel plant privatization
Previous Post

‘లైవ్ టెలికాస్ట్’లో కాజల్ దూకుడు

Next Post

ప్రేమికుల రోజే మనసు విప్పుతుందట శ్రీముఖి?

Related Posts

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

by లియో డెస్క్
September 14, 2026 6:50 pm

ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. అర్హులైన...

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

by లియో డెస్క్
September 13, 2026 5:35 pm

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

by లియో డెస్క్
September 10, 2026 5:11 pm

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న...

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

by లియో డెస్క్
September 9, 2026 7:21 pm

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ ఛైర్మన్‌...

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

by లియో డెస్క్
September 9, 2026 5:29 pm

రాజకీయ కక్షసాధింపు చర్యలు ఏ స్థాయికి దిగజారతాయో చెప్పడానికి మూడేళ్ల క్రితం జరిగిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

‘కరుణామయుడు’ వెనక ఎంతపెద్ద ‘షో’ నడిచిందో?

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

Lavanya Tripathi

ముఖ్య కథనాలు

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist