ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ శ్యాంప్రసాద్ రాజకీయంగా చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి. కర్నూలు మెడికల్ కాలేజ్‌లో జరిగిన వేడుకలకు హాజరైన వీసీ.. జగన్ రాష్ట్రంలో చాలామంచి పనులు చేస్తున్నారని.. కొన్ని అక్కరలేని పనులు చేస్తున్నా వాటిని చూసిచూడనట్టు వదిలేయాని పేర్కొనడం విశేషం. కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరీ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని చెప్పారు.
బీసీ, ఎస్టీ, ఆటోవాళ్లను, దర్జీలకు.. ఇలా అన్ని వర్గాల వారికి డబ్బులు ఇస్తున్నారని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నెక్స్ కూడా ఆయనే సీఎం అవుతారు. అప్పుడు ఇంకా మేజర్ రెవల్యూషన్ వస్తుంది. గతంలో వైద్య శాఖకు 2 శాతం మాత్రమే కేటాయించేవారని.. కానీ జగన్ 10 శాతం కేటాయిస్తున్నారని శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. దాదాపు 20 వేల కోట్లు మంజూరు చేశారని చెప్పుకొచ్చారు. ఇలాగే కొనసాగితే జగన్ మళ్లీ అధికారాన్ని చేపట్టడం ఖాయమని అన్నారు.
రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి.. రాజకీయంగా వ్యాఖ్యలు చేయడం తగదని కొందరు పేర్కొంటున్నారు. అధికార పార్టీ తొత్తులాగా మాట్లాడుతున్నారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీరామ్ తీవ్రంగా మండిపడ్డారు. వీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయాలపట్ల ఆసక్తి ఉంటే.. శ్యాంప్రసాద్ తన పదవికి రాజనామా చేసి.. జగన్ పార్టీలో చేరి ఆయన గురించి భజన చేసుకుంటూ ఉంటే ఎవరు అడగరని విమర్శించారు. కానీ రాజ్యంగబద్దమైన పదివిలో ఉంటూ ఇలా మాట్లాడడం.. విద్యా వ్యవస్థకే చెడ్డ పేరు తెస్తున్నారని చెప్పుకొచ్చారు.
Must Read ;- నాగార్జున యూనివర్శిటీలో రికార్డింగ్ డాన్సులు, జగనన్న పాటలు..










