పవన్ విషయంలో జగన్ రాంగ్ బటన్ నొక్కారా..?అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తోంది.జనసేనాని పవన్ కళ్యాణ్..
2014 నుంచి రాజకీయాల్లో స్వతంత్రంగా చురుగ్గా ఉన్నారు. బీజేపీ..,టీడీపీ గెలుపుకోసం పనిచేసి.. సొంత పార్టీ జనసేనను స్థాపించి.. సామాజీక న్యాయం కోసం పోరాడుతున్నారు. కాపు సామాజీక వర్గానికి చెందిన పవన్.. కాపు ఓటు బ్యాంకుతో పాటు ఆయనకున్న సినీ గ్లామర్ ను తోడు చేసి .. దశాబ్ధకాలంగా అన్నీ సామాజీక వర్గాల్లో గుర్తుంపు సాధించారు. ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కును సాధించిన యువత.. ఈసారి పవన్ వైపు చూస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకూడదు అన్న వ్యూహంతో.. పవన్ టీడీపీతో పొత్తుపెట్టుకునిచ ఉమ్మడి రాజకీయాలకు పదును పెంచాడు. ఇదే జగన్ కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మొన్నటి వరకు వై నాట్ 175 అన్న ఫ్యాన్ బ్యాచ్ .. నేడు గొంతులో వెలక్కాయపడ్డ చందగా మారింది. ఇప్పుడు 125 .. కాదు 25 రావడం కూడా కష్టమే అని సొంతపార్టీ నేతల స్పష్టతకు వచ్చారు.
మరోవైపు పవన్ ను దత్తపుత్రుడు.., మూడు పెళ్ళిళ్లు అంటూ పదేపదే వేదికలపై విమర్శించే ముఖ్యమంత్రి జగన్ ను.. ఆ హోదాలో నీకు ఆ విమర్శలు తగునా.. అయ్యా..? అంటూ సోషల్ మీడియాలో ప్రజలు ప్రశ్నలు పెద్దఎత్తునే సంధిస్తున్నారు. ఏ వేదికపైనైనా ఇదే విమర్శలు జగన్ నోటివెంట రోటిన్ గా మారడంతో అది ఆ పార్టీకే రివర్స్ అయింది. ఇలా జగన్ చేస్తున్నవిమర్శలపై వైసీపీలోని కాపు నేతలు పెదవిరుస్తుంటే.., నూట్రల్ కాపు ఓటర్లు జగన్ విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే వస్తున్నారు.
జగన్ విమర్శలు పెద్దగా పట్టించుకుని జనసేనాని.. తనదైన శైలిలో పొత్తు రాజకీయంతో ముందుకుపోతున్నారు. ప్రతిరోజు జగన్ అవినీతిపై జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఒకవైపు నుంచి బీజేపీ జగన్ అవినీతిని ఒక్కొక్కటిగా బయటకు తీసి.. విమర్శలు సంధిస్తుంటే.. మరోవైపు జనసేన డిఫరెంట్ స్టైల్లో అవినీతిని బయటకు తీసి.. మీడియాకు వివరిస్తోంది. ఈ వార్తలన్నీ సోషల్ మీడియాతోపాటు ప్రధాన మీడియాలో ప్రముఖంగా పేలుతున్నాయి. దీంతో దిక్కుతోచని అధికార వైసీపీ నష్ట నివారణ చర్యలు వైపు చూస్తోంది. టీడీపీ నేతలపై ఒంటికాలుపై లేచే వైసీపీ మంత్రులు.., ఎమ్మెల్యేలు.. జనసేన, బీజేపీ విమర్శలకు కౌంటర్స్ ఇవ్వాలంటే.. తాడేపల్లి ఆదేశాల కోసం వేచి చూడాల్సి వస్తోంది. ఇలా పవన్ ను తక్కువ అంచన వేసి.. రాంగ్ బటన్ నొక్కామా..? అన్న డైలామాలో జగన్ అండ్ టీం ఉన్నారని సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా పెద్దఎత్తున ట్రోల్స్ మొదలయ్యాయి.