తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ నేత, రాష్ట్ర అగ్రో కార్పొరేషన్ డైరెక్టర్ వంతు నాగరాజు కుమారుడు వంతు కుశరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. రౌతులపూడి మండలంలోని ఎమ్.కొత్తూరు గ్రామంలో వివాహితపై అత్యాచారయత్నం చేసిన ఘటనలో పోలీసులు కుశరాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్టు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కుశరాజు అదుపులోనికి తీసుకున్నామని, అరెస్ట్ చేసి జ్యూడిషల్ రిమాండ్‌కు పంపినట్టు కోటనందూరు ఎస్‌ఐ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. తనపై అఘాయిత్యానికి యత్నించిన కుశరాజుకు కఠినమైన శిక్ష విధించాలని బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
సునీల్ కోసం ప్రత్యేక క్యారెక్టర్ ను రూపొందించిన డైరెక్టర్ శంకర్ ,మళ్లీ కమిడియన్ గా కనిపిస్తారని వార్తలు
కమిడియన్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై హీరో స్థాయి కి చేరిన...