జమ్మూ కశ్మీర్ లోని సోపోర్ లో సీఆర్పీఎఫ్ బంకర్ పై దాడి జరిగింది. ఓ మహిళ బాంబు దాడికి పాల్పడగా, దాడికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బుర్ఖా ధరించి వచ్చిన మహిళ తన బ్యాగులో ఉన్న బాంబును బయటకు తీసి క్యాంపు వైపు విసిరి పరారైంది.అయితే దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం, గాయాలు కాలేదు.ఇక దాడికి పాల్పడిన మహిళను గుర్తించామని ,త్వరలోనే ఆమెను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.మరోవైపు శ్రీనగర్ లోని రైనావారి ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో లష్కరే తాయిబాకు చెందిన ఇద్దరు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఇందులో మాజీ జర్నలిస్ట్ రయీస్ అహ్మద్ భట్ సైతం ఉన్నట్టు కశ్మీర్ జోన్ పోలీసులు ప్రకటించారు.
Must Read:-‘370’ చుట్టూ జమ్మూ కశ్మీర్ పార్టీల కొత్త రాజకీయం