ఏపీలో పంచాయతీ ఎన్నికలు ప్రభావం మొదలైంది. ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తున్న రేషన్ డోర్ డెలివరీ పథకం అనంతపురం జిల్లా కదిరిలో సీఎం జగన్ ఫిబ్రవరి 1 నుండి ప్రారంభించాలి నిర్ణయించారు. కానీ, పంచాయతీ ఎన్నికల కారణంగా అధికారులు ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఏడాది క్రితమే ప్రారంభం కావాల్సిన ఈ కార్యక్రమం లాక్ డౌన్, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు ఆలస్యం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. చివరకి అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఫిబ్రవరి ప్రారంభించాలని ముహూర్తం ఫిక్స్ చేసిన టైంలో ఎన్నికలు అడ్డుపడ్డడంతో మళ్లీ వాయిదా పడింది.
వారం రోజుల క్రితం విజయవాడలో జెండా ఊపి ప్రారంభించిన సంగతి తెలిసిందే. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500 వాహనాలకు సీఎం స్వయంగా ప్రారంభించారు. దీనికి సంబంధించి జగన్ ప్రభుత్వం 9,260 వాహనాలను రూ 539 కోట్ల వ్యయంతో కొనుగోలు చేశారు. ఈ వాహనాల ద్వారా రోజుకు 90 కార్డులకు తగ్గకుండా 18 రోజుల పాటు రేషన్ సప్లై చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ కార్పోరేషన్ల ద్వరా ఎంపిక చేసిన లబ్దిదారులకు సరుకులు పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.
Must Read ;- ‘అమ్మ ఒడి’లో సిఎం జగన్ వరాల జల్లులు..