తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా పోటీ చేస్తున్న గురుమూర్తిపై తెలుగుదేశం పార్టీకి చెందిన వెబ్ సైట్లో దళితులను కించపరిచే విధంగా పోస్టు పెట్టారంటూ బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్, వైసీపీ ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, అనిల్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‍పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, సైబర్ చట్టాల కింద చర్యలు తీసుకోవాలని వారు డీజీపీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫ్రింట్ కాపీలను వైసీపీ నేతలు డీజీపీకి అందించారు. చంద్రబాబు, లోకేష్‌లపై అట్రాసిటీ కేసు పెట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డీజీపీకి విజ్ఙప్తి చేశారు.
Must Read ;- తిరుమల పవిత్రతను కాపాడాలి.. చంద్రబాబు