పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ శుక్రవారం విడుదల అయ్యింది. బెనిఫిట్ షోలు, టికెట్ల పంపును ఏపీ సర్కార్ అడ్డుకోవడంతో అభిమానులు ఆందోళన చేశారు. తాజాగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి సునిల్ దియోదర్ జగన్ తీరును నిరసిస్తూ సంచనల కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్ క్రేజ్ ను చూసి ఓర్వలేక బెనిఫిట్ షోలు రద్దు చేశారని ఆయన పేర్కొన్నారు. జనసేన, బీజేపీ కూటమిని తట్టుకోలేక జగన్ ఇలా చేస్తున్నాడని అన్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఎవరికీ భయపడరని జగన్ కు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా తాను వకీల్ సాబ్ ను చూస్తానని అన్నారు.
Must Read ;- ‘వకీల్ సాబ్’ మూవీ రివ్యూ