టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్‌తో వైఎస్సార్‌సీపీ యువ ఎంపీ భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్‌లో వైరల్‌గా మారడంతో సర్వత్రా ఇదే చర్చ నడుస్తోంది. అయితే మొన్నటి వరకు ఆ యువ ఎంపీ వైసీపీని వీడి టీడీపీలో చేరతారని.. ఆ తర్వాత క్లారిటీ ఇచ్చి.. ఇప్పుడు లోకేష్ తో భేటీ అయ్యాక ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లుగా కనిపిస్తోంది. ఆ ఎంపీ ఎవరు? వీరిద్దరూ ఏ సందర్భంలో కలిశారు? అసలు విషయం ఏంటి..? దానికి సంబందించిన ఆసక్తికర విషయాలు మనం ఇప్పుడు చూదాం..
ఆ యువ ఎంపీ మరెవరో కాదు నరసరావుపేట ఎంపీపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. చైతన్య విద్యా సంస్థాన్ అధినేత బీఎస్ రావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని శుక్రవారం స్వగ్రామానికి తీసుకురాగా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, విద్యాసంస్థల పెద్దలు నివాళులర్పించారు. అయితే అక్కడికి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, నారా లోకేష్ కూడా వచ్చారు. ఇక్కడ ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీ బీఎస్‌రావు భౌతికకాయానికి నివాళులు అర్పించి తిరిగి వస్తుండగా ఎదురుగా నారా లోకేష్ వచ్చారు. దీంతో అక్కడ ఆగిన యువ ఎంపీ జనాలను పక్కకు నెట్టి మరీ లోకేష్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత అక్కడి ప్రజలకు వంగి నమస్కరిస్తూ లోకేష్ ముందుకు వెళ్లగా.. ఎంపీ లావు బయటకు వచ్చారు. ఈ దృశ్యాన్ని చూసిన కొందరు వైసీపీ, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు కెమెరాల్లో బంధించారు. ఈ ఆసక్తికర సన్నివేశానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తలు తమాషాగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎంపీ ముందుకొచ్చి లోకేష్‌కి షేక్హ్యాండ్ ఇవ్వడంతో ఏదో జరుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ అక్కడి సందర్భం వేరు.. సీఎం వైఎస్ జగన్ అదే స్థానంలో ఉన్నా పలకరింపులు ఉంటాయని ఊహించాల్సిన అవసరం లేదని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి.
నిజానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని.. టీడీపీ అధినేత చంద్రబాబుతో రహస్యంగా భేటీ అయ్యారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. పైగా.. నరసరావుపేట పార్లమెంట్‌కు చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో గొడవలు జరగడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇదంతా ఒక ఎత్తయితే.. గతేడాది టీడీపీ ఎంపీలతో ఫొటోలు దిగడం పెద్ద చర్చకు దారి తీసింది. అలాగే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఆయనతో పాటే టీడీపీ గూటికి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే.. తాజాగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, లోకేష్ వద్దకు వెళ్లి మరీ కరచాలనం చేయడంతో ఏపీ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఎవరికి వారే యమునా తీరు అన్నారు ఉంది..