పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ప్రతిపక్ష పార్టీల్లో స్పష్టత కొరవడింది. దీంతో ఎవరికి ఓటు వేయాలో తెలియక ఆయా పార్టీల ఓటర్లు తలలు పట్టుకుంటున్నారు. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా నరసరావుపేట సీటును జనసేనకు కేటాయించినట్లు ఆ పార్టీ అభ్యర్థి సయ్యద్ జిలానీ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి అరవింద్‌బాబు, రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్రప్రసాద్‌లు టీడీపీ టిక్కెట్ ఎవరికి దక్కుతుందోనన్న పోటీగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎలెక్షన్ లో పల్నాడు గడ్డ మీద సైకిల్ జండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా నరసరావుపేట నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించకపోవడం వల్ల మరింత ఈసారి పల్నాడు జిల్లాలో టీడీపీ హావ కొనసాగడం పక్క అని టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా ముందుకెళ్తున్నాయి.. గత ఎన్నికలకు ముందు హడావుడిగా అభ్యర్థిని ప్రకటించడంతో సమయాభావంతో సక్రమంగా పనిచేయలేకపోయారని వాపోయారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, నేతల గురించి తెలుసుకునే సమయం దాదాపు పూర్తయిందని, అందుకే అప్పటి అభ్యర్థి విహాసయంలో చేసిన పొరపాటును ఈ సారి జరగకుండా జాగ్రత్త పడుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు మొదటి నుంచి పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్న అరవిందబాబుపై వైసీపీ నేతలు దాడులు చూపిస్తున్నారని సమాచారం. మరోవైపు నల్లపాటి రామచంద్రప్రసాద్ కూడా పార్టీ కార్యక్రమాల నిర్వహణలో స్పీడ్ పెంచడంతో నరసరావుపేట టీడీపీలో, పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజం కనిపిస్తోంది.. పార్టీ నాయకత్వాన్ని అందించి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని, పల్నాడుకి టీడీపీకి అడ్డాగా మారబోతుందని టీడీపీ శ్రేణులు విశ్లేషించుకుంటున్నాయ్.
టీడీపీ-జనసేన పొత్తుపై ఆ పార్టీ నేతలకు స్పష్టత వచిన్నట్లే కనపడుతుంది.. పొత్తుల్లో నరసరావుపేట సీటును జనసేనకు కేటాయించారన్న ఆ పార్టీ అభ్యర్థి మాటలను జనసైనికులు లైట్ తీసుకుంటున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి పరిస్థితి ఎలా ఉన్నా.. ప్రత్యర్థి పార్టీ నేతల మధ్య విభేదాలు తనను మరోసారి అధికార పీఠంపై కూర్చోబెడతాయనే నమ్మకంతో ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట రాజకీయం రసవత్తరంగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు.