ఎమ్మెల్యే కన్నబాబు ఎప్పటిలాగే తనదైన శైలిలో ప్రజలను బెదిరిస్తూ మాట్లాడుదాం అనుకున్నారు. కానీ, వారి నోటి దూకుడుకు ప్రజలు చెక్ పెట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎలమంచలి ఎమ్మెల్యే కన్నబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా.. తన నోటికి పనిచెప్పారు..ఎప్పటిలాగే మమ్మల్ని గెలిపించకపోతే.. ప్రభుత్వ పథకాలు మీకెవరిస్తారు, మీకు కావాల్సినవి ఎవరు చేస్తారు.. వేరే పార్టీ వాళ్లు గెలిచినా.. అధికారం ఉండేది మా ప్రభుత్వం అంటూ రెచ్చిపోతున్న కన్నబాబు మాటల్ని జనం సహించలేక ఒక్కసారిగా తిరగబడ్డారు.
ప్రజల నుంచి ప్రతిఘటన వస్తుందని ఊహించని ఎమ్మెల్యే అవాక్కయ్యారు. గన్ మెన్ అప్రమత్తం కావడంతో వెంటనే వారికి రక్షణ కల్పించారు. ఈ చర్యతో ఆగ్రహోదక్తులైన ఎమ్మెల్యే గారు మైక్ పడేది ప్రజలను మరింత భయపెట్టడానికి ప్రయత్నించారు. కానీ, ప్రజల కోపం చల్లారకపోవడంతో తానే అక్కడ నుంచి వెళ్లడం మంచిదని తెలుసుకుని బయలుదేరారు. కానీ, ఎమ్మెల్యే గారు కారు ఎక్కి వెళ్లేంత వరకు ప్రజలు నినాదాలు చేస్తూ.. ఎమ్మెల్యే బెదిరింపులకు నిరసన తెలిపారు. చివరకు పోలీస్ రక్షణ మధ్య ప్రజల నుంచి తప్పించుకుని కారులో అక్కడి నుంచి అతికష్టం మీద బయటపడ్డారు కన్నబాబు.
Also Read: కన్నబాబుకు బెయిల్.. అచ్చెన్నకు జైల్ !











