చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..వై.ఎస్.జగన్‌కు అత్యంత దగ్గరి వ్యక్తుల్లో ఒకరు. అంతేకాదు వైసీపీలో సీనియర్ నేత. గతంలో జగన్‌పై ఎదుటిపార్టీ వాళ్లూ విమర్శలు చేస్తే చెవిరెడ్డి అంతెత్తున లేచేవారు. కానీ ఇప్పుడు ఆయన వైఖరి మార్చుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన చెవిరెడ్డి..తర్వాత సైలెంట్ అయిపోయారు. మొత్తంగా చెవిరెడ్డి శాంతిమంత్రం జపిస్తున్నారంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి.
గత నెలలో పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరిగిన విషయం తెలిసిందే. ఆ సభలో మాజీ మంత్రి,జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీఎం జగన్‌పై రెచ్చిపోయారు. తన ఆస్తులను జగన్ లాక్కున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనను గెలికితే రాబోయే రోజుల్లో మరిన్ని నిజాలు బయటపెడతానంటూ వైసీపీకి హెచ్చరికలు జారీ చేశారు. ఐతే బాలినేని వ్యాఖ్యలపై వైసీపీ నుంచి పెద్దగా కౌంటర్లు రాలేదు. నిజానికి బాలినేనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత మాజీ ఎమ్మెల్యే, ఒంగోలు వైసీపీ సారథిగా ఉన్న చెవిరెడ్డిపైనే ఉంది.
చెవిరెడ్డి నుంచి బాలినేని గట్టి వార్నింగ్ ఉంటుందని వైసీపీ శ్రేణులు భావించారు. బాలినేనిని రాజకీయంగా చావు దెబ్బ కొట్టేంత వరకు నిద్రపోకూడదని చెవిరెడ్డి నిద్రపోకూడదంటున్నారు. చెవిరెడ్డి కౌంటర్ కోసం పాపం ఇంకా వేచి చూస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. మరోవైపు ఎవరేం మాట్లాడాలో తాడేపల్లి నుంచి స్క్రిప్టులు అందుతుంటాయి. కానీ బాలినేనికి కౌంటర్ ఇచ్చే విషయంలో చెవిరెడ్డికి ఇంకా స్క్రిప్ట్ అందలేనట్టుంది.
బాలినేని తనపై తీవ్ర ఆరోపణలు గుప్పించగా, ఆ జిల్లా వైసీపీ బాధ్యుడిగా చెవిరెడ్డి కౌంటర్ ఇవ్వకపోవడంపై జగన్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. బాలినేని ఆరోపణలు తనకు తీవ్ర నష్టం కలిగిస్తున్నా, విని కూడా పట్టనట్టు ఉన్నావేంటని చెవిరెడ్డిని జగన్ ప్రశ్నించినట్లు సమాచారం. అయినప్పటికీ చెవిరెడ్డి స్పందించకపోవడం గమనార్హం. ఏమి లేని రోజుల్లో చెవిరెడ్డి దూకుడు ప్రదర్సించారని, గడిచిన ఐదేళ్లలో బాగా సమకూర్చుకోవడంతో వాటిని కాపాడుకునేందుకు మౌనవ్రతం పాటిస్తున్నారంటూ వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతి అని చెప్పినప్పటికీ, రాజకీయాల్లో అన్ని వేళలా ఇది సరైంది కాదని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇప్పటికే చెవిరెడ్డిపై చాలా మంది ఫోకస్ పెట్టారని, బాలినేని విమర్శలకు చెవిరెడ్డి కౌంటర్ ఇవ్వకపోతే కౌంట్‌డౌన్ మొదలువుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.