మనసుని తాకే ఒక్క మాట.. మనిషిని కదిలిస్తుంది. ఆ మాటకు చేతలు తోడైతే.. మహా నాయకుడు అవుతారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రస్తుతం అదే బాటలో ఉన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా తన సొంత కుటుంబ సభ్యులకే ఆ కష్టం వచ్చినట్లుగా స్పందిస్తున్నారు. వారి సమస్యలను క్షణాల్లో తీరుస్తున్నారు..
ఇటీవల టీడీపీ సీనియర్ నేత ఒకరు మరణించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు ముఖ్య నాయకులంతా వచ్చారు. దివంగత నేతకు నివాళులు అర్పించడానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ స్వయంగా వెళ్లారు. కారు దిగుతూనే ముందుగా తనకు కనిపించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ని చూసి.. ఆయన కుటుంబం ఎలా ఉంది..?? వారి పిల్లలు ఎలా ఉన్నారు.?? ఏం చేస్తున్నారు..?? ఉద్యోగాలలో స్థిరపడ్డారా..?? వ్యాపారాలు చేస్తున్నారా…?? వారి ఆర్ధిక పరిస్థితులు ఏంటి…?? అని ఆ కుటుంబ బాగోగులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ప్రశ్నలతో విజయ్ చలించిపోయారు. ఈ ప్రశ్నలు… లోకేశ్‌లోని నాయకత్వ లక్షణాలను వెలికితీస్తోంది.. పార్టీ కార్యకర్తలు.. నాయకులను ఆయన ఎంత అభిమానిస్తారో, వారి శ్రేయస్సుపై ఆయన ఎలాంటి శ్రద్ధాసక్తులు ప్రదర్శిస్తారో తెలియజేస్తుంది. మొక్కుబడిగా పరామర్శించే నేతలను చాలా మందినే చూసి ఉంటారు. కానీ ఒక కార్యకర్త కుటుంబం యోగ క్షేమాల గురించి ఆలోచించే నాయకులు అరుదుగా కనిపిస్తారు.. లోకేష్.. ఆ అరుదైన నేతగా ఎదుగుతున్నారని తాజా ఘటన మరోసారి ప్రూవ్ చేసిందని చర్చ జరుగుతోంది..
ఎన్నికలొస్తే తప్ప గడప దాటని నాయకులు.. ఓట్ల కోసమే జనాల్లోకి వెళ్లే లీడర్లు కోకొల్లలు. దండలేయించుకొని.. దండాలు పెట్టించుకొని.. పై నుంచి దిగొచ్చిన దేవుళ్ల మాదిరిగా పోజులు కొట్టే మహా మేతలు, నేతలు మన కళ్ల ముందే తిరుగుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ మాత్రం పాలిటిక్స్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులను సొంత కుటుంబంలా చూసుకుంటూ… ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకొస్తున్నారు. టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన వారిని రెడ్ బుక్‌లోకి ఎక్కించడమే కాదు.. ఇబ్బందుల్లో ఉన్న కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకొంటున్నారు.
లోకేశ్ లాంటి నాయకుడిని బ్లైండ్‌గా ఫాలో అయిపోవచ్చు అంటున్నారు చింతకాయల విజయ్. ఎందుకంటే టీడీపీ కార్యకర్తల భవిష్యత్ భారం మొత్తం లోకేశ్ చూసుకొంటారు కాబట్టి.