ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కి.. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఉన్న బంధుత్వం గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.. బాబాయ్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని జగన్ అన్ని విధాలుగా కాపాడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం జగన్ .. అవినాష్ ని సేవ్ చేస్తున్నా.. త్వరలోనే ఝలక్ ఇవ్వనున్నారని వైసీపీ వర్గాలలో చర్చ సాగుతోంది.. రాబోయే ఎన్నికలలో అవినాష్ రెడ్డికి కడప ఎంపీ టికెట్ కష్టమే అని, ఆయన స్థానంలో మరొకరిని వెతుకుతున్నారని తెలుస్తోంది..
సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఉన్నారనే ఆరోపణలతో ఇటు జగన్ ఇమేజే కాదు, వైసీపీకి కూడా బాగా డ్యామేజ్ జరిగింది.. ముఖ్యంగా వైసీపీ కంచుకోటగా భావించే రాయలసీమలో ఈ వ్యవహారం ఆ పార్టీ పుట్టి ముంచేలా కనిపిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం హెచ్చరిస్తున్నాయట.. అవినాష్ రెడ్డిని జగన్ స్వయంగా కాపాడుతున్నారని ఎక్కువమంది నమ్ముతున్నారట.. దీంతో, ఈ ఎపిసోడ్ కి త్వరలోనే చెక్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చారట జగన్..
రాబోయే ఎన్నికలలో కడప ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికి ఇవ్వకూడదని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారట వైసీపీ అధినేత.. ఆయన స్థానంలో కొందరి పేర్లను తెరమీదకు తెచ్చారని పార్టీ వర్గాలలో చర్చ సాగుతోంది.. జగన్ తల్లి విజయలక్ష్మిని పోటీ చేయించాలని భావిస్తున్నారట.. ఇటు, తన నమ్మినబంటు, పార్టీలో నెంబర్ టూగా ఎదిగిన సజ్జల రామకృష్ణా రెడ్డిని సైతం రేసులో నిలపాలనే యోచనలో ఉన్నారట జగన్..
ఈ ఇద్దరితో పాటు మరికొందరి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.. ఇటు తన సతీమణి భారతిని సైతం బరిలోకి దింపాలని భావిస్తున్నారట జగన్.. ముఖ్యంగా అవినాష్ తో జరిగిన నష్టాన్ని వేరొకరితో భర్తీ చేసుకోవాలనే యోచనలో ఉంది వైసీపీ హైకమాండ్.. అయితే, కడప ఎంపీ స్థానానికి వివేకా కూతురు సునీత కూడా ఏదో ఒక పార్టీ నుండి రేసులో నిలవాలనే భావనలో ఉన్నారట. తనకు న్యాయస్థానంతోపాటు ప్రజా కోర్టులోనూ తేల్చుకోవాలనుకుంటున్నారట.. ఇదే వైసీపీ అధినాయకత్వాన్ని కలవర పెడుతోందని, సునీత రేసులో నిలిస్తే అవినాష్ ఓడిపోవడం ఖాయమని లెక్కలు కడుతున్న జగన్, ఇతర మార్గాలు అన్వేషిస్తున్నారట.. అవినాష్ ని కడప స్థానం నుండి తప్పించడానికే మొగ్గు చూపుతున్నారట. అయితే, అవినాష్ కి హ్యాండ్ ఇచ్చినా.. ఆయన తప్పు చేశారని నైతికంగా అంగీకరించినట్లవుతుందనే యోచన కూడా చేస్తున్నారట జగన్.. మరి, ఫైనల్ గా జగన్… ఇన్నాళ్లూ కాపాడుతూ వచ్చిన అవినాష్ కి హ్యాండ్ ఇస్తారా.. లేదా అనేది చూడాలి..










