వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ సీరియస్ జోక్ పేల్చారు.. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన కామెడీ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఎంతో సీరియస్‌గా కనిపించే వైఎస్ జగన్ రెడ్డి, తాజాగా బాధతో కూడిన ఆవేదన కలిసిన సెటైర్లు వేస్తున్నారు.. చట్టబద్ధంగా, రాజ్యాంగం పరంగా కల్పించడానికి అవకాశం లేని ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.. అది సాధ్యం కాదు అని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ చెబుతున్నా… ఆయన వినరు.. తనదైన బాణీలో వాటిపైనా జోకులు వేస్తారు జగన్.. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్నా ఆయన పట్టించుకోరు.. లైట్ తీసుకుంటారు..
తాజాగా జగన్ పేల్చిన మరో సీరియస్ జోక్ ఏంటంటే… ఏపీలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 40 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడట.. ప్రభుత్వ రంగంలో 6 లక్షల మందికి ఉపాధి కల్పించగా, ప్రయివేటు రంగంలో 34 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు సృష్టించానని తెలిపారు మాజీ ముఖ్యమంత్రి జగన్. కావాలంటే, వారి ఆధార్ కార్డుల అడ్రస్ ఇస్తానని పక్కాగా చెబుతున్నారు వైసీపీ అధినేత..
ఇదే ఇప్పుడు సంచలనంగా మారుతోంది.. జగన్ ఇంత పచ్చిగా అబద్ధాలు ఎలా ఆడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.. జగన్ కల్పించిన ఉద్యోగాలు ఏంటంటే…. లిక్కర్ షాపులలో ఉద్యోగాలు, వాలంటీర్ జాబ్స్, ఇసుక ర్యాంప్‌ల దగ్గర ఉపాధి అవకాశాలు, మటన్ మార్ట్, ఫిష్ మార్టులలో అని సెటైర్లు వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.. ఈ జాబ్స్ రెండులక్షలు మించవు.. ఇక, గ్రూప్ 1, గ్రూప్ 2, టీచర్స్ ఉద్యోగాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్…
జగన్ నిజంగానే 40 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించి ఉంటే, ఆ కుటుంబాలు అన్నీ వైసీపీకి ఓటు వేసి ఉండేవి.. కానీ, అది ఎక్కడా జరగలేదు.. యువత జగన్‌పై విరుచుకుపడింది. ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసింది.. ప్రస్తుతం జగన్ చెబుతోన్న 40 లక్షల ఉద్యోగాల కల్పన ఉపాధి హామీ రోజు వారీ కూలీలని కలిపి అని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.. చంద్రబాబు ప్రభుత్వం రాబోయే అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చింది.. ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.. ఇప్పటికే పలు కంపెనీలు ఏపీకి క్యూ కట్టాయి.. కడుతున్నాయి.. దీంతో, దానికి రెట్టింపు స్థాయిలో తాను ఉద్యోగాలు సృష్టించానని చెబితేనే సమర్ధించుకోవడానికి వీలవుతుందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.. జగన్ చెప్పిన ఉద్యోగ లెక్కలని ఆ పార్టీ నేతలే నమ్మడం లేదు.. మరి, ఇతర పార్టీల నేతలు ఎలా విశ్వసిస్తారని కౌంటర్ ఇస్తున్నారు. జగన్.. సుద్దిని.. సుప్పిని.. శుద్దపూసని… అని కామెడీ చేస్తున్నారు.. ట్రోల్ చేస్తున్నారు. ఆయన సృష్టించిన ఉద్యోగ అవకాశాలపై ఒక పవర్ పాయింట్ ప్రెజెంట్ చేసి ఇవ్వగలరా అని నిలదీస్తున్నారు నెటిజన్లు..