మద్యం అమ్మకాలలో జగన్ సర్కార్ రికార్డ్ నెలకొల్పిందని లెక్కలు చెబుతున్నాయి.. ఈ నాలుగేళ్లలో జగన్ సర్కార్.. లక్ష కోట్ల రూపాయల మద్యం అమ్మినట్లు తెలుస్తోంది..
ఏపీకి ఇప్పటికే జరిగిన నష్టం చాలా ఎక్కువ… కొత్త పెట్టుబడుల్లో మనకు కొరత.. కొత్త కంపెనీలు లేవు, కొత్త పరిశ్రమలు లేవు.. కొత్త ఉపాధి లేదు, మౌలిక సదుపాయాలు లేవు.. ఇప్పటికీ రాజధాని లేదు. పోలవరం ఇప్పటికి పూర్తి కాలేదు.. రాష్ట్రానికి ఆదాయం లేదు.. జీడీపీ తగ్గింది.. బీపీఎల్ భారీగా పెరిగింది.. కిరాణా ధరలు పెరిగాయి.. కరెంట్ బిల్లులు, ఆస్తి పన్నులు పెరిగాయి.. నేడు ప్రభుత్వం ప్రధానంగా మద్యంపై ఆధారపడి నడుస్తోంది. ఒక్కసారి ఏపీలో మద్య నిషేధం అమలులోకి వస్తే ఏపీ ఎలా మనుగడ సాగిస్తుందో ఊహించలేం.
ప్రజలు సంతోషంగా లేకుంటే మీకు సందేహం రావచ్చు.. స్థానిక సంస్థల ఎన్నికలు, మునిసిపల్ ఎన్నికలు మరియు ఇటీవల తిరుపతిలో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రభుత్వం ఎలా గెలిచింది.. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్ధమవుతుంది 2019 ఎలక్షన్ లో జగన్ ఇచ్చిన అతి పెద్ద హామీ పద్యపాన నిషేధం, కానీ అధికారం చేతికొచ్చాక ఇచ్చిన హాహామీలని ఫ్యాన్ గాలికి వొదిలేసి, అదే మద్యం వ్యాపారాన్ని విచ్చిల విడిగా పర్మిషన్ ఇచెసారు, జగనన్న బ్రాండ్స్ పుణ్యాన వేళా కుటుంబలు రోడ్డున పడ్డాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ల కాలంలో మద్యం ద్వారా వచ్చిన ఆదాయం అక్షరాలా లక్ష కోట్లు అంటే ఆశర్యం వేయక మానదు. పూర్తిగా మద్యపానం నిషేదిస్తా, మద్యపానం లేని ఆంధ్ర ప్రదేశ్ గాతీర్చి దిద్దుతా అని ప్రగల్బాలు పలికిన సీఎం జగన్ మోహన్ రెడ్డిగారు, లక్ష కోట్లకి పై మాటే మద్యపానం అమ్మకాలు ఎలా జరిగాయని ప్రశ్నిస్తున్నారు ఆంధ్ర ప్రజలు.