October 28, 2026 1:37 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

గద్దెనెక్కించిన 2కేసులతోనే, జగన్ రెడ్డి గద్దె దిగడం తథ్యమా..?

వివేకా హత్య కేసు మెడకు చుట్టుకుందా..? కోడికత్తి కేసు కాళ్లకు బంధమైందా..?

May 24, 2023 at 3:27 PM
in Andhra Pradesh, Editors Pick, General, Latest News
ys jagan cases

ys jagan cases

Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైసిపికి అధికారం 5ఏళ్ల ముచ్చటేనా..? 2024లో ఓటమికివే ఉరితాళ్లా..?
దేవుడి స్క్రిప్టు అని పదేపదే వల్లెవేసే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలే ఇప్పుడాయన చెవుల్లో గింగుర్లు అంటున్నాయి. ఏ రెండు కేసులైతే ఆయన్ను ముఖ్యమంత్రిని చేశాయో, అవే కేసులు ఇప్పుడాయన మెడకు చుట్టుకోవడం దేవుడి స్క్రిప్టుగాక ఇంకేంటి..? మొన్ననే ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 23ఓట్లతో టిడిపి అభ్యర్ధి పంచుమర్తి అనురాధ ఘనవిజయం సాధించడం కూడా దేవుడి స్క్రిప్టే అని తెలుగుదేశం నాయకుల వ్యంగ్యోక్తులు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైఎస్ వివేకా హత్య కేసు, కోడికత్తి కేసు రెండూ జగన్మోహన్ రెడ్డిని, అధికార పార్టీ వైసిపిని బెంబేలెత్తిస్తున్నాయి, నిద్రలేని రాత్రులనే మిగిల్చాయి..

2014మార్చిలో జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి కిరాతక హత్యను ప్రతిపక్షం తెలుగుదేశంపైకి నెట్టి, నారాసుర రక్తచరిత్ర అని సొంత మీడియాలో రాసి, టిడిపి నేతలు ఆదినారాయణ రెడ్డి, బిటెక్ రవి చేత చంద్రబాబు, లోకేశ్ చేయించారని ఎన్నికల్లో ప్రచారంచేసి, ప్రజల్లో అపోహలు సృష్టించి, సానుభూతి ఓటు పొంది అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రి బాబాయి హత్య కేసు విచారణ గత నాలుగేళ్లుగా నాన్చుతూ రావడం విదితమే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ విచారణ డిమాండ్ చేసిన జగన్ సీఎం అయ్యాక సిబిఐ అవసరం లేదనడం, సొంత అన్న ప్రభుత్వమే తనతండ్రి హత్య కేసు నీరుగార్చడం సహించలేక వివేకా కుమార్తె సుప్రీంకోర్టుకెళ్లి సిబిఐ విచారణ కోరడం, 3ఏళ్ల 3నెలలుగా సిబిఐ ఎంక్వైరీకి అడ్డంకులు సృష్టిస్తూ, రాష్ట్రప్రభుత్వ సహాయ నిరాకరణ ఏ స్థాయిలో ఉందో ప్రజల కళ్లముందే ఉంది. 4కోర్టులు, 5గురు ఎంక్వైరీ ఆఫీసర్లు, 4ఏళ్లుగా ఒక కొలిక్కితేని నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందించి కేశవ రామ్ చౌరాసియా నేతృత్వంలో ఇంకో సిట్ వేసి ఏప్రిల్ 30లోపు దర్యాప్తు పూర్తిచేయాలని ఆదేశించింది, తాజాగా ఆ గడువును మరో 2నెలలు (జూన్ 30కు) పొడిగించింది.

వివేకా హత్య కేసు దేశంలో వ్యవస్థలకే విషమ పరీక్ష అయ్యింది. సొంతూళ్లో, సొంతింట్లో, సొంతోళ్లే అతి కిరాతకంగా తలపై, ఛాతీపై 7గొడ్డలి వేట్లు, 2లీటర్ల రక్తపు మడుగులో హత్యకు గురైతే జగన్ అనుచరులు, సొంత మీడియా ఆ రోజు ఉదయమే గుండెపోటు అనడం, కొన్ని గంటల్లోనే దాన్ని మార్చేసి, హత్యగా పేర్కొంటూ, ఆ నింద తెలుగుదేశంపై వేయడం చూశాం..సిబిఐ అడుగుపెట్టి ఇప్పటికి 3ఏళ్ల 3నెలలైనా, ఇప్పటికీ వాళ్ల విచారణ సాఫీగా జరగకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందీ జగన్ ప్రభుత్వమే..దర్యాప్తు అధికారి రాం సింగ్ ను బెదిరించడం, స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టడం, ఆయన కోర్టుకెళ్లి బెయిల్ తెచ్చుకోవడం, రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణకు మచ్చుకు కొన్నే..
నిందితుల తరఫున ఢిల్లీస్థాయిలో వందల కోట్లు వెదజల్లి అడ్వకేట్లను పెట్టి పిటిషన్ల మీద పిటిషన్లు వేయించి ఎంక్వైరీని అడ్డుకున్న విధానం గతంలో ఎన్నడూ చూడలేదు. ఈ 4ఏళ్లలోనే కొందరు సాక్షుల అనుమానాస్పద మరణాలు మరో ట్విస్ట్. ఎప్పటికప్పుడు ఇంప్లీడ్ అవుతూ కేసు విచారణ సజావుగా జరిగేందుకు వివేకా కుమార్తె డా సునీత పోరాటం ప్రజల మెప్పు పొందింది. ఆమె పోరాట ఫలితంగానే చిక్కుముళ్లన్నీ విడివడి హంతకులెవరో, హత్య కారణమేంటో తెలిసేసరికి ఏదోరకంగా దీన్ని నిలువరించాలనే కుట్రకోణంతో, అధికారం అండతో నిందితులు, వాళ్ల వెనుకనున్న అదృశ్యశక్తులు చేస్తున్న నీచయత్నాలు, కుయుక్తులు అన్నీఇన్నీకావు.

కడప ఎంపీ సీటు కోసమే తండ్రీ కొడుకులు(వైఎస్ భాస్కర రెడ్డి, అవినాశ్ రెడ్డి) ఈ హత్యకు స్కెచ్ వేశారని, రాజకీయంగా అడ్డుగా ఉన్న వివేకాను అంతం చేస్తేనే తమకు రాజకీయ భవిష్యత్ ఉంటుందని, ఇందులో ఎర్ర గంగిరెడ్డి,దస్తగిరి,గజ్జల ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ పాత్రధారులు మాత్రమేనని, అసలు సూత్రధారులు తాడేపల్లి ప్యాలెస్ నుండే చక్రం తిప్పారనేది ప్రజాబాహుళ్యంలో జరుగుతోన్న విస్తృత చర్చ..
ఇప్పటికే సిబిఐ ఆ నలుగురితో పాటు కడప ఎంపి అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడం జరిగింది. అరెస్ట్ కు భయపడే అవినాశ్ హైదరాబాద్ నుండి పారిపోయి, అమ్మను అడ్డం పెట్టుకుని కర్నూలు ఆస్పత్రిలో దాక్కోవడం, అక్కడికొచ్చిన సిబిఐ అధికారులను అడ్డుకోమని ఇతర ప్రాంతాలనుంచి పెద్దఎత్తున అరాచకశక్తులను కర్నూల్లో మొహరించి, ఉద్రిక్తతలు సృష్టించడాన్ని దేశం మొత్తం చూస్తోంది.. అతనొక ఎంపీగా, శాసన కర్తల స్థానంలో ఉండి శాసనాలనే లెక్కచేయక పోవడం, చట్టాలనే ధిక్కరించడం, అటు సిబిఐని, ఇటు కోర్టులను లెక్కపెట్టనితత్వం ఎవరి అండ చేసుకుని అనేది చెప్పాల్సిన పనిలేదు…పైగా ఎవరు పురమాయిస్తే ఆసుపత్రి బైట అతనికి కాపలాగా వైసిపి ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో బైఠాయించారో చెప్పాల్సింది కాదు…ఇదే సామాన్యుడకైతే అదే సిబిఐ ఇన్ని వెసులుబాట్లు ఇస్తుందా, ప్రభుత్వాలిలా ప్రేక్షకపాత్ర పోషిస్తాయా అనేదానిపైనే చర్చోపచర్చలు..

ఇక రెండో కేసు కోడికత్తి కేసు గురించి…విశాఖ ఎయిర్ పోర్టులో ఇది జరిగి ఇప్పటికి 4ఏళ్ల 7నెలలు.. 2018 అక్టోబర్ 25న జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకొస్తే, వీఐపి లాంజ్ లో జరిగిన ఉదంతమిది..జగన్ అభిమాని అయిన జల్లెపల్లి శ్రీనివాసరావు, ఆయన్ను సీఎం చేసేందుకు ప్రజల్లో సానుభూతి కోసమే ఇలా చేశానని, పొడిచేముందు దాన్ని స్టెరిలైజ్ చేశానని, ఆ చిన్నగాటుతో ఎలాంటి ఇబ్బంది ఉండదని, అదే విషయం జగన్ కు కూడా చెప్పాననే నిందితుడిచ్చిన వాంగ్మూలం గమనార్హమైనది..పెద్దపెద్ద హత్యల్లో నిందితులైనవాళ్లు స్వేచ్చగా తిరుగుతుంటే, తన కొడుకిలా నాలుగున్నరేళ్లుగా జైల్లో మగ్గుతున్నాడని చెప్పుకోడానికి వచ్చిన శ్రీనివాస రావు తల్లిని కలిసేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి నిరాకరించడాన్ని ఏమనాలి, ఎలా చూడాలి..

ఈ కేసులో బాధితుడైన జగన్మోహన్ రెడ్డి సాక్ష్యమిచ్చేందుకు కనీసం కోర్టుకెళ్లకుండా కొన్నేళ్లుగా ఎగ్గొట్టడం వెనుక మర్మం ఏమిటనేదే ప్రజలందరి ప్రశ్న.. ముఖ్యమంత్రినైన తాను కోర్టుకొస్తే ట్రాఫిక్ జామ్ అవుద్దని, సీఎం షెడ్యూల్ బిజీ వల్ల రాలేకపోతున్నానని, తానొస్తే సంక్షేమ పథకాల అమలుకు అంతరాయాలు కల్గుతాయనే కుంటిసాకులతో ఇన్నేళ్లుగా నెట్టుకొచ్చారు, పదేపదే పిటిషన్ల మీద పిటీషన్లు వేస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా జైల్లో మగ్గుతున్న శ్రీను లైఫ్ షెడ్యూలే(జీవితమే) దెబ్బతింది మరి దానిమాటేంటి..?
కొడుకు దూరమై తీవ్ర మానసిక క్షోభతో వృద్ధాప్యంలో తల్లడిల్లుతున్న అతని తల్లిదండ్రుల మాటేంటి..? ఒక మనిషి జీవితం కన్నా ట్రాఫిక్ జామే ఎక్కువా, సీఎం షెడ్యూలే ఎక్కువా..? ఆ మాటకొస్తే ముఖ్యమంత్రి పర్యటనల సందర్భంగా ప్రతిరోజూ ఆయా నగరాల్లో, ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ లు అవడం లేదా..? శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా ఎక్కడో 138కిమీ అవతల ఒడిశా సరిహద్దులోనే లారీలు ఆపేసి 13గంటలపాటు ట్రాఫిక్ జామ్ లో నరకం చూపించిన మాటేంటి..? వాటికి లేని ట్రాఫిక్ జామ్ లు, కోడికత్తి శీను కేసులో కోర్టుకెళ్లేందుకే అడ్డొస్తుందా..?

4ఏళ్ల క్రితం 2019జనవరి 17న ఏ క్యాసెట్ అయితే వేశారో అదే కేసెట్ వేశారు తాజా పిటిషన్ లో కూడా..కుట్ర కోణమని మళ్లీ ఈ పిటిషన్ లోనూ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు..ఇందులో ఏమాత్రం కుట్రకోణం లేదని నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ(ఎన్ ఐఏ) చెప్పింది..కోడికత్తి కేసులో లేని కుట్రకోణంపై ఏదో ఉందన్నట్లుగా, వివేకా హత్య కేసులో ఉన్న కుట్ర కోణాన్ని లేనట్లుగా పిటిషన్లపై పిటిషన్లు వేయడాన్ని ప్రజలే నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నారు. ఎవరో సినీనటుడు ఎప్పుడో చేసిన వ్యాఖ్యలను అడ్డం పెట్టుకుని నిజంగానే అది ‘ఆపరేషన్ గరుడ’ అంటూ అప్పటి కాక్ అండ్ బుల్ స్టోరీతో కోడికత్తి కేసును ముడిపెట్టడం నిజంగా హాస్యాస్పదమే..
ఎన్నికల చివరి ఏడాది జగన్ గ్రాఫ్ ఇప్పటికే తిరగబడింది..సర్వేలన్నీ వైసిపి ఓటమి ఖాయమనేది పేర్కొంటున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి గ్రాఫ్ 10-15% పతనమైందని, సీఎంగా దేశంలో 19వ ర్యాంకులో ఉన్నాడనే వార్తలతో గాభరా మొదలైంది..ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ మూడుప్రాంతాల్లో మొత్తం 3స్థానాల్లో వైసిపి ఘోరంగా ఓటమికి బేజారెత్తారు.. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి బిసి అభ్యర్ధిని పంచుమర్తి అనురాధ ఘన విజయం గోరుచుట్టుమీద రోకటి పోటయ్యింది.

నాలుగేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సాధించింది శూన్యమనేది ప్రజల్లోకి బలంగా వెళ్లింది. పోలవరం సహా 3ప్రాంతాల్లో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణ పనులు పడకేయించడం, అమరావతిలో రూ 2లక్షల కోట్ల సంపద ధ్వంసం చేయడం, 3రాజధానుల పేరుతో మూడు ముక్కలాట, నాలుగేళ్లలో 400 ఇళ్లు కూడా పేదలకు నిర్మించక పోవడం, వాటాల కోసం బెదిరించి కంపెనీలను పారిపోయేలా చేయడం, పెరిగిన నిరుద్యోగం, పేదల స్కీముల్లోనూ స్కాములకు పాల్పడటం, ల్యాండ్-శాండ్ మాఫియా, వైన్ –మైన్ మాఫియాలకు అదనంగా గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అరాచక శక్తుల స్వైర విహారం, అశాంతి-అభద్రత, రూ 11లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రం దివాలా తీసే స్థితికి చేరిన నేపథ్యంలో తెలంగాణ మంత్రుల అవహేళనలు, ఎగతాళిపై ప్రజానీకంలో ఆగ్రహావేశాలున్నాయి.

ఈ పరిస్థితుల్లో ఏ రెండు కేసులైతే(వివేకా హత్య, కోడికత్తి) జగన్మోహన్ రెడ్డిని గద్దెనెక్కించాయో ఆ రెండు కేసులే ఇప్పుడాయన ప్రభుత్వానికి, పార్టీకి ఉరితాళ్లుగా మారాయనేది అక్షర సత్యం..ఎవరినీ ఎక్కువకాలం మోసం చేయలేం, ఎప్పుడో ఒకప్పుడా మోసం బైటపడక తప్పదు, అందుకు తగ్గ శిక్ష తప్పదనేది చరిత్ర చెప్పిన సత్యం.

Tags: ap newsap politicskodi kathi caseleotopys avinash reddy arrestys jaganYS Jagan Mohan Reddyys viveka case
Previous Post

దేశంలోనే సంపన్న సీఎం నోట ‘‘పేదలు, పెత్తందార్ల యుద్ధమన్న మాటలా..?’’

Next Post

Microsoft starts downloading Windows 10 automatically through Windows Update Windows 10

Related Posts

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

by లియో డెస్క్
October 27, 2026 8:00 pm

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు, నామినేషన్ల గడువు పొడిగింపు పేరిట ప్రక్రియను...

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

by లియో డెస్క్
October 27, 2026 7:34 pm

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం తిరుపతి అతిపెద్ద జాతీయ భద్రతా సదస్సుకు వేదిక కాబోతోంది....

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

by లియో డెస్క్
October 27, 2026 5:46 pm

వైఎస్సార్ ఫ్యామిలీలో ఆస్తి వివాదం మరింత ముదురుతోంది. చెల్లెలు షర్మిలకు దక్కాల్సిన వాటా...

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

by లియో డెస్క్
October 27, 2026 5:42 pm

పోలీసులపై నోరుపారేసుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే, రాప్తాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి...

ORR, ఎయిర్‌పోర్ట్‌.. చంద్రబాబు తెచ్చినవే…. నిజాలు చెప్పిన తెలంగాణ మంత్రి.!

by లియో డెస్క్
October 27, 2026 4:53 pm

హైదరాబాద్ మహానగరం ప్రపంచ పటంలో నిలవడానికి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు...

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

by లియో డెస్క్
October 27, 2026 4:19 pm

దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో జరుగుతున్న ఆస్తుల వివాదం,...

సొంత గడప కడపలో.. జగన్ జెండా పీకేసిన కూటమి

by లియో డెస్క్
October 26, 2026 8:48 pm

స్థానిక సంస్థల ఎన్నికలు.. కడప జిల్లాలో వైసీపీ అసలు బలాన్ని బయటపెట్టాయి. జగన్‌మోహన్‌రెడ్డి...

జూన్‌లో ఆస్తి పంపకాలపై చర్చ..సెప్టెంబర్‌లో YSR మరణం..రెండింటికీ లింక్ ఉందా.!

by లియో డెస్క్
October 26, 2026 7:08 pm

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదం తీవ్రస్థాయికి చేరడంతో.....

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

by లియో డెస్క్
October 26, 2026 7:06 pm

నాలుగు గంటల వ్యవధిలోనే వైసీపీ పేటీఎమ్‌ బ్యాచ్‌, జగన్‌ సోషల్‌ మీడియా టీమ్‌...

జగన్‌ గం*జాయి Vs లోకేష్‌ గూగుల్‌..ఏది బెస్ట్‌.?

by లియో డెస్క్
October 26, 2026 5:35 pm

వైసీపీ ప్రభుత్వంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన 500 ఎకరాలను కాజేసేందుకు అప్పటి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

సొంత గడప కడపలో.. జగన్ జెండా పీకేసిన కూటమి

ORR, ఎయిర్‌పోర్ట్‌.. చంద్రబాబు తెచ్చినవే…. నిజాలు చెప్పిన తెలంగాణ మంత్రి.!

జూన్‌లో ఆస్తి పంపకాలపై చర్చ..సెప్టెంబర్‌లో YSR మరణం..రెండింటికీ లింక్ ఉందా.!

నామినేషన్‌ ఉపసంహరణ కార్యకర్తను చెప్పుతో కొట్టిన వైసీపీ నేత జక్కంపూడి

ముఖ్య కథనాలు

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

అనుమానం నుంచి ప్రశంసల దాకా..లోకేష్ స్పీడ్‌కు మోహన్‌దాస్ ఫిదా..!

గొడవలు చేయకుండా ఏం పీకుతున్నారు.. చెవిరెడ్డి, బుగ్గన, బైరెడ్డిపై జగన్ సీరియస్..!

మా*, మా** లం**.. దళితులపై వైసీపీ నేత సుధాకర్ రెడ్డి బూతు పురాణం..!

ట్రంప్‌కి షాక్‌ ఇచ్చేలా అమరావతి క్వాంటమ్ కంప్యూటర్‌.. దటీజ్‌ చంద్రబాబు..

కూతురి పెళ్లి కార్డుతో.. షర్మిల ట్రాప్‌లో జగన్, భారతి..!

రీ నామినేషన్‌ లేదు.. స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ ఫేక్ ప్రచారం..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

ORR, ఎయిర్‌పోర్ట్‌.. చంద్రబాబు తెచ్చినవే…. నిజాలు చెప్పిన తెలంగాణ మంత్రి.!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

సొంత గడప కడపలో.. జగన్ జెండా పీకేసిన కూటమి

జూన్‌లో ఆస్తి పంపకాలపై చర్చ..సెప్టెంబర్‌లో YSR మరణం..రెండింటికీ లింక్ ఉందా.!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

జగన్‌ గం*జాయి Vs లోకేష్‌ గూగుల్‌..ఏది బెస్ట్‌.?

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

ORR, ఎయిర్‌పోర్ట్‌.. చంద్రబాబు తెచ్చినవే…. నిజాలు చెప్పిన తెలంగాణ మంత్రి.!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

సొంత గడప కడపలో.. జగన్ జెండా పీకేసిన కూటమి

జూన్‌లో ఆస్తి పంపకాలపై చర్చ..సెప్టెంబర్‌లో YSR మరణం..రెండింటికీ లింక్ ఉందా.!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

జగన్‌ గం*జాయి Vs లోకేష్‌ గూగుల్‌..ఏది బెస్ట్‌.?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist