రెండు రోజుల క్రితం వెలువడిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మరోసారి ఈవీఎం ల గురించి చర్చ జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో ముందంజలో ఉన్న కాంగ్రెస్.. ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం కాగానే.. బీజేపీ లీడ్‌లోకి వచ్చింది. ఈవీఎంల లెక్కింపు కంటే ముందు మెజారిటీ స్థానాల్లో లీడింగ్‌లో ఉన్న కాంగ్రెస్.. ఈవీఎంల లెక్కింపుతో వెనుకబడిపోయి చివరికి 37 స్థానాలకే పరిమితం అయింది. ఈ నేపథ్యంలోఏ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఈవీఎంలపై తమ సందేహాలను వ్యక్తం చేస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ లేవనెత్తిన అభ్యంతరాలపై ఇప్పుడు మరోసారి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈవీఎంల కంటే బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు జరిగితేనే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సమయంలో తొలి గంటలో నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సుమారు 70కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగారు. ఆ తరువాత ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. ఈవీఎం కౌంటింగ్ లో బీజేపీ దూసుకెళ్లిపోయింది. చివరికి బీజేపీ 48 స్థానాల్లో గెలిచి హర్యానాలో హ్యాట్రిక్ విజయం సాధించింది. తొలుత 70కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కనిపించిన కాంగ్రెస్ ఫైనల్‌గా కౌంటింగ్ ముగిసే సరికి 37 నియోజకవర్గాల్లో గెలిచింది.
మొన్న ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం ఎదురుకాగానే.. ఈవీఎంలపై పలు సందేహాలు వ్యక్తంచేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అవే కామెంట్లను చేశారు. హర్యానాలో బీజేపీ గెలుపు ఈవీఎంలతోనే సాధ్యమైదని వ్యాఖ్యానంచారు. ఇకపై ఓటింగ్‌ను పేపర్ బ్యాలెట్ల ద్వారా చేపట్టాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. పేపర్ బ్యాలెట్‌తోనే ఓటర్లలో విశ్వాసం కలుగుతుందని బుధవారం ‘ఎక్స్’ లో పేర్కొన్నారు వైఎస్ జగన్. హరియాణా ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు భిన్నంగా లేవన్నారు. ఏపీ ఫలితాలపై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉ న్నాయని ప్రస్తావించారు.
2019 ఎన్నికల్లో వైసీపీ విజయం వెనుక ఈవీఎంలలో ఏదో మతలబు ఉ ందని ఆరోపణలు వచ్చినప్పుడు దానిని ఖండించిన ఆయన జగన్మోహన్ రెడ్డి.. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడినప్పుడు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు హరియణా ఎన్నికలపై కూడా ఇదే అభిప్రాయాన్ని జగన్ వ్యక్తం చేశారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ జగన్‌పై సీరియస్‌గా ఉన్నట్టుగా తెలుస్తోంది. హరియాణాలో బీజేపీ కేవలం ఈవీఎంల ద్వారానే గెలిచిందనేది కాదని.. ప్రజలు కోరుకుని మరీ బీజేపీని గెలిపించారనేది ప్రచారం కాకుండా.. కేవలం ఈవీఎంల ద్వారానే గెలిచిందనే అభిప్రాయం సరైంది కాదన్నారు. జగన్ వ్యాఖ్యలపై సీరియస్ అయిన ప్రధాని మోడీ.. అమిత్ షాతో మాట్లాడి ఇటువంటివి బయటికి ప్రొజక్టు కాకుండా చూడాలని సూచించినట్టు తెలుస్తోంది.