హిందీ మీద ఏపీలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. పవన్‌కల్యాణ్ హిందీ మన పెద్దమ్మ అంటూ చేసిన వ్యాఖ్యలతో మొదలైంది ఈ చర్చ. లోకేష్ సైతం హిందీ నేర్చుకోవడంలో తప్పేం లేదంటూ నేషనల్ మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఐతే దీనిపై వైసీపీ సోషల్‌మీడియా ట్రోల్స్‌కు దిగింది. ఐతే తాజాగా వైసీపీ సోషల్‌మీడియాకు జగన్ బిగ్‌షాక్ ఇచ్చారు. హిందీ విషయంలో కుండబద్దలు కొట్టారు. హిందీ జాతీయ భాషగా తేల్చేశారు. తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత జాతీయ మీడియాకు కూడా ఇంటర్యూలు ఇచ్చారు. ఇందులో ఓ రిపోర్టర్ హిందీ వివాదంపై మాట్లాడితే..అది నేషనల్ లాంగ్వేజ్ అని తేల్చేశారు. దాంతో అందరూ ఆశ్చర్యపోవాల్సిందేం లేదన్నారు.
ఇదే విషయాన్ని లోకేష్ చెబితే…వైసీపీకి చెందిన చాలా మంది.. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. జరుగుతున్న వివాదాన్ని ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. హిందీ నేర్చుకోవడం తప్పేం కాదన్నట్లుగా ఉన్నారు. ఇప్పుడు మరి లోకేష్ ను ట్రోల్ చేసిన వాళ్లు జగన్ నూ ట్రోల్ చేస్తారా అంటే..ఆ బాధ్యత టీడీపీ వాళ్లు తీసుకుంటారని అనుకోవచ్చు.
నిజానికి తెలుగురాష్ట్రాల్లో హిందీని పెద్దగా వ్యతిరేకించట్లేదు. కానీ తమిళనాడు, కర్ణాటకలో హిందీకి వ్యతిరేకంగా ప్రజలు, కొన్ని సంస్థలు ఉద్యమాలు చేస్తున్నాయి. హిందీని బలవంతంగా రుద్దొద్దంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇంగ్లీష్ సహా ప్రపంచ భాషలు అన్నీ నేర్చుకోవచ్చు హిందీ తప్పా అన్న విధానం, నినాదం కొనసాగుతోంది. మహారాష్ట్రలో కూడా థాక్రే బ్రదర్స్ హిందీ వ్యతిరేక పాలిటిక్స్ చేస్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఏనాడూ ఆ పరిస్థితి లేదు. రాజకీయ పార్టీలు సైతం పెద్దగా వ్యతిరేకించడం లేదు.











