వక్ఫ్ చట్టంపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి మడమ తిప్పారా?? ఆయన మాట తప్పారా?? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.. ఈ చట్టంపై ఇటీవల పార్లమెంట్‌లోని ఉభయ సభలలో రెండు భిన్నమైన మార్గాలను ఎంచుకున్న వైసీపీ, తాజాగా మరోసారి తన రూట్ మార్చుకుంది… వక్ఫ్ చట్టంపై సుప్రీం కోర్టులో కేసు ఫైల్ చేయడానికి సన్నద్ధం అవుతోంది.. అయితే, జగన్ ఇంత తక్కువ సమయంలోనే ఇన్ని సార్లు తన విధానం మార్చుకోవడంపై మైనారిటీలు మండిపడుతున్నారు.
ఇటీవల పార్లమెంట్‌లో ఏళ్ల తరబడి నానుతూ వస్తోన్న వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టారు.. దీనిపై ఇప్పటికే లోక్ సభలో ప్రతిపాదిత వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి, రాజ్యసభలో అనుకూలంగా ఆ పార్టీ ఓటు వేసినట్లు జాతీయ మీడియాలోనూ ప్రచారం జరిగింది.. రాజ్యసభలో జగన్ సొంత బాబాయ్, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి.. వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా నాలుగు మాటలు మాట్లాడి, ఆ తర్వాత ఆ బిల్లుకి మద్దతు ఇచ్చినట్లు ఆధారాలతో సహా కథనాలు వెలువడ్డాయి.. కేంద్రంలోని ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాపై భయంతో వైసీపీ ఇలా ద్వంద్వ ప్రమాణాలు పాటించినట్లు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు..
జగన్‌కి ఇటీవల జరిగిన ఎన్నికలలో దారుణమైన ఫలితాలు దక్కాయి.. ఇటు, ఆయన గ్రాఫ్ డౌన్ అయింది.. ఇటు, జగన్‌పై కేసులు బోలెడు ఉన్నాయి.. వాటి నుండి శరణు దక్కాలంటే వైసీపీ… వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడమే బెటర్ అని ఓ నిర్ణయానికి వచ్చి, రాజ్యసభలో సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.. కానీ, అంతలోనే జగన్… ఈ వక్ఫ్ బిల్లుపై సుప్రీం కోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం ఏంటనే చర్చ మొదలయింది.. జగన్‌కి అంతటి నిబద్ధత, నిజాయితీ ఉండి ఉంటే పార్లమెంట్‌లో చట్టం చేసినప్పుడు ఎందుకు ఓటు వేయలేదన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి..
అధికారంలో ఉన్న సమయంలో జగన్… బీజేపీతో సన్నిహిత సంబంధాలు నెరిపారు.. తాజాగా, ఏపీలో కూటమి ప్రభుత్వం నెలకొనడంతో ఆయనకు జాతీయ రాజకీయాలలో స్థానం పడిపోయింది.. దీంతో, కాంగ్రెస్‌కి దగ్గరవ్వాలనే ఆలోచనతోనే జగన్ ఈ కుయుక్తిని ఎంచుకున్నారని రాజకీయ పండితులు అభిప్రాయ పడుతున్నారు.. మరోవైపు, జగన్ తమని వెన్నుపోటు పొడిచారని మైనారిటీలు భావిస్తున్నారని, ఇది తమకు డ్యామేజ్ చేస్తుందని అంచనాకి వచ్చిన వైసీపీ అధిష్టానం కేసుతో చేతులు దులుపుకునే యత్నం చేసినట్లు విశ్లేషిస్తున్నారు కొందరు విశ్లేషకులు.. ఈ ఓట్ బ్యాంక్… కాంగ్రెస్‌కి వెళ్లిపోతుందనే భయంతోనే వైసీపీ తన స్టాండ్ మార్చుకొని, కొత్త నాటకానికి తెరదీస్తున్నారని మరికొందరి విశ్లేషణ.. మొత్తమ్మీద, జగన్ మరోసారి మాట తప్పి, మడమ తిప్పారనే కామెంట్స్ వెలువడుతున్నాయి..