అనిల్ కుమార్ యాదవ్..వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పేరు గట్టిగా వినిపించేది. జగన్ కేబినెట్‌లో మొదటి రెండున్నర సంవత్సరాలు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన అనిల్ కుమార్ యాదవ్..ఆ టైంలో ప్రతిపక్షపార్టీలపై అప్పుడు రంకెలేసేవారు. నోరేసుకుని మీద పడిపోయారు. అలాంటి నేత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. పార్టీ కార్యక్రమాల్లోనూ కనిపించడం లేదు ఐతే అనిల్ కుమార్ యాదవ్‌ను వైసీపీ చీఫ్ జగనే పక్కన పెట్టేశారని తెలుస్తోంది.
నెల్లూరు సిటీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ కుమార్..మొన్నటి ఎన్నికల్లో నరసారావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. కాదు నెల్లూరు సిటీ స్థానంలో అనిల్‌పై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో జగనే అనిల్‌ను నరసారావుపేట నుంచి పోటీ చేయించారు. ఐతే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు చేతిలో ఘోరంగా ఓడిపోయారు అనిల్. ఈ ఓటమి తర్వాత ఆయన కనిపించకుండా పోయారు.
ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ ఉన్నారనే విషయం వైసీపీ నేతలకు సైతం తెలియని పరిస్థితి. నెల్లూరు సిటీ నియోజకవర్గ బాధ్యతలను సైతం టీచర్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు జగన్. దీంతో ఆయన నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ కేడర్‌ను తిరిగి యాక్టివేట్ చేస్తున్నారు. నిజానికి నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట. కానీ మొన్నటి ఎన్నికల్లో జిల్లాలో కూటమి వైసీపీని కోలుకోలేని దెబ్బకొట్టింది.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లాలో ఆధిపత్యం కోసం ప్రయత్నించారు అనిల్ కుమార్ యాదవ్. పార్టీ సీనియర్ నేత కాకాణితోనూ అనిల్‌కు విబేధాలు ఉన్నాయి. ఈ వివాదాలు చాలాసార్లు రచ్చకెక్కాయి. ఇక ఎన్నికల సమయంలో వేమిరెడ్డి దంపతులు వైసీపీని వీడడం పార్టీకి పెద్ద మైనస్‌గా మారింది. ఐవేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ తరపున ఎంపీగా విజయం సాధించగా..ఆయన సతీమణి మేమిరెడ్డి ప్రశాంతి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక జిల్లాలో కూటమి మెజార్టీ స్థానాలు సాధించడంలో కీరోల్ ప్లే చేశారు. ఐతే వేమిరెడ్డి దంపతులు పార్టీ మారడానికి అనిల్ కుట్రపూరిత పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయమై జగన్‌కు జిల్లా నేతల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే నెల్లూరు సిటీ బాధ్యతలను టీచర్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి జగన్ అప్పగించారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో అనిల్ కుమార్‌ను వైసీపీ ఏ విధంగా ఉపయోగించుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది.











