సంకల్ప దీక్ష తర్వాత షర్మిల మరో దీక్ష కు సిద్ధంకానున్నారు. తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యలు, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్ష చేయనున్నారు. 3 రోజుల పాటు హైదరాబాద్‌లో నిరాహారదీక్ష చేస్తానని ఆమె ప్రకటించారు. కానీ పోలీసులు మాత్రం ఒక రోజు అనుమతి ఇచ్చారు. రేపు ఉదయం 10 గంటల నుంచి ఐదు గంటల వరకు మాత్రమే నిరాహార దీక్ష చేయనున్నారు. అయితే నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేంతవరకు దీక్షలు చేస్తూనే ఉంటానని షర్మిల అంటున్నారు. ప్రధానంగా షర్మిల నిరుద్యోగ సమస్యలపై దీక్ష చేస్తుండటంతో పెద్ద ఎత్తున నిరుద్యోగులు, విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ, కేసీఆర్ లక్యంగా చేసుకొని ఆమె దీక్షకు దిగనున్నట్లు తెలుస్తోంది.
Must Read ;- షర్మిల పక్కా స్క్రిప్ట్.. అధికార టీఆర్ఎస్‌ను అంటేనే ఆదరిస్తారనా..!