దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో సీబీఎస్ఈ బోర్డు 10వ తరగతి పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 10వ తరగతి విద్యార్థుల అంతర్గత అసెస్‌మెంట్ ఆధారంగా వారికి మార్కులను వేస్తామని తెలిపింది. 12వ తరగతి పరీక్షలను మాత్రం వాయిదా వేసింది. ఎప్పుడు నిర్వహిస్తామనేది వెల్లడించలేదు. కరోనా వైరస్ తగ్గిముఖం పట్టి, పరిస్థితులు ఎప్పటిలాగా ఉంటేనే పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. కరోనా కేసులు తగ్గిన తర్వాతనే పరీక్షలు నిర్వహించాలని స్టూడెంట్స్ తల్లిదండ్రులు లెటర్స్ రాయడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Must Read ;- కరోనా ముప్పు.. మళ్లీ అదే తప్పు చేస్తున్న తెలంగాణ సర్కార్