వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా పులివెందులలోని ఇడుపులపాయకు కుటుంబం సహా నివాళులు అర్పించారు . వైఎస్ షర్మిల వెంట ఆమె భర్త అనిల్ కుమార్, తల్లి విజయమ్మ, కుమార్తె అంజలిరెడ్డి ఉన్నారు. అదే సమయంలో షర్మిల పేరున ఉన్న ఆస్తులు అన్ని కూడా తన పిల్లలు కొడుకు రాజా రెడ్డి , కూతురు అంజలిరెడ్డి పేరున వీలునామా చేసి అందరికి షాకిచ్చారు వై ఎస్ షర్మిల. అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సాధారణ ప్రజల్లోనూ, ఉన్నటుండి షర్మిల తీసుకున్న నిర్ణయానికి అందరు కూడా ఆశ్చర్యపోయారు. అప్పటి నుండి ఒకటే చర్చ్ నడుస్తోంది, పిల్లల పేరున అప్పుడే వీలునా రాయడానికి గల కారణాలేంటి అని ఆరాతీయడం మొదలు పెట్టారు.
‘రాజా , చిన్న పిల్లాడిగా ఉన్న నువ్వు, ఈ రోజు మీరు అద్భుతమైన వ్యక్తిగా ఎదగడం చూడటం చాలా ఆనందంగా ఉంది. మీ చుట్టూ ఉన్న వారితో ఎల్లప్పుడూ నిజాయితీగా మరియు దయతో ఉండండి అని దీవించి, రాజకీయ ఓనమాలు నేర్పుతుంది అంట కొడుక్కి రాజా రెడ్డి. అయితే రాజా రెడ్డిని రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దాలనే ఆలోచనలో ఉన్నటు తెలుస్తోంది అయితే రెడ్డి బాడీ, ఫిజిక్ చుస్తే హీరో మెటీరియల్ అంటున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకుల పిల్లలు సినిమాల్లోకి వచ్చారు. తాజాగా వైఎస్ షర్మిల తనయుడు హీరోగా లాంచ్ కానున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే సర్ ప్రైజ్ గా కాకుండా నిలదొక్కుకునేలా భారీగా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మనకి అందుతున్న సమాచారం ప్రకారం షర్మిల కొడుకు రాజా రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనపడుతోంది. అందుకే షర్మిల తన ఆస్తులని కొడుకు పేరున వీలునామా రాసిందని, తన అన్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి నా కొడుకే కర్రెక్ట్ మొగుడు అని , జగన్ కి పోటీగా పొలిటిషన్ గ తీర్చిదిద్దాలని కంకణం కట్టుకుందని తెలుస్తోంది.. వచ్చే సార్వత్రిక ఎలెక్షన్ లో కొడుకుని ఆంధ్ర ప్రదేశ్ బరిలో దింపాలని చూస్తోంది అని సమాచారం, షర్మిల తెలంగాణ నుండి బరిలో నిల్చునే ఆలోచన ఉన్నటు తెలుస్తోంది..