వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నాలుగేళ్లలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ముగ్గురు మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పీ అనిల్‌కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి నెల్లూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. సీఎం జగన్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. 2014లో నెల్లూరు జిల్లాలో టీడీపీ కేవలం 3 సీట్లు మాత్రమే గెలుపొందినప్పటికీ, గత ప్రభుత్వం జిల్లాలో అభివృద్ధి పనులకు కోట్లు ఖర్చు చేసిందని, నెల్లూరు నగర అభివృద్ధికి రూ.4,500 కోట్లు, కండలేరు లిఫ్ట్ కెనాల్‌కు రూ.63 కోట్లతో నీళ్లిచ్చామని గుర్తుచేశారు. 2014లో 16,000 ఎకరాలకు
సర్వేపల్లె నియోజకవర్గంలోని మిత్తుకూరు మండలంలో యువగళం పాదయాత్రలో భాగంగా జరిగిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి లోకేష్ మాట్లాడుతూ సర్వేపల్లె నియోజకవర్గ ప్రజలు కాకాణి గోవేదన్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి పెద్ద తప్పు చేసారని ఎద్దేవా చేసారు.. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా, భూకబ్జాలు, అక్రమ మద్యం తయారీ, కోర్టులో డాక్యుమెంట్ల చోరీకి సంబంధించి ఎనిమిది కేసుల్లో వ్యవసాయ మంత్రి నిందితుడిగా ఉన్నారని, దోషిగా తేలితే మంత్రి కటకటాల వెనక్కి వెళ్తారని లోకేష్ అన్నారు. కోట్లాది రూపాయల విలువైన 100 ఎకరాల ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలతో అక్రమంగా కబ్జా చేశారన్న ఆరోపణలపై తహశీల్దార్ సహా 8 మందిని జైలులో పెట్టారన్నారు.
తమకు గోవర్ధన్ రెడ్డి మద్దతిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్ అతిపెద్ద ప్రోహెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టును 2020 నాటికి పూర్తి చేస్తామన్న హామీని నిలబెట్టుకోవడంలో మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విఫలమయ్యారని లోకేష్ విమర్శించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న తన విజ్ఞప్తిని ముఖ్యమంత్రి జగన్ తిరస్కరించడంతో అనిల్ ఇప్పుడు నిరుత్సాహానికి గురయ్యారని ఆయన అన్నారు.
తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో లక్ష ఎకరాలకు నీరు అందించారని, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి అయ్యాక ప్రాజెక్టు కింద మరో 1.3 లక్షల ఎకరాలకు నీరు అందించారని ఆయన సూచించారు. ఇలా నారా లోకేష్ వైసీపీ చిట్టా విప్పేసరికి ఒక్కొక్కరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, లోకేష్ అడుగుతున్నా ఏ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేక తల దించుకుంటున్నారు వైసీపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి..