ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ఓడిపోవడం ఖాయమని, జగన్ సొంత ఇంటెలిజెన్స్ సహా ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ సర్వేలు కూడా ఢంకా బజాయించి చెబుతున్నాయి. కానీ, జాతీయ స్థాయిలో పేరున్న టైమ్స్ నౌ సంస్థ మాత్రం లోక్ సభ ఎన్నికల్లో జగన్ కు 24 నుంచి సీట్లు వస్తాయని అంచనా వేసింది. టీడీపీకి ఒక సీటు, జగనసేన ఏ సీట్లు రావని సదరు సంస్థ వెల్లడించింది. ఏ విషయాలను ప్రాతిపాదికగా తీసుకొని చెప్పిందో ఎవ్వరికీ అంతు బట్టడం లేదు. కానీ, అది పచ్చి ఫేక్ సర్వే అని, పక్కాగా వైసీపీ అధిష్ఠానమే అలా సర్వేలో చెప్పేలా లోపాయికారిగా ఒప్పందం చేసుకుందని మాత్రం అందరూ నమ్ముతున్నారు. చివరికి వైఎసీపీ నేతలు కూడా ఆ ఈటీజీ టైమ్స్ నౌ సర్వేను పట్టించుకోకపోవడం గమనించదగ్గ విషయం.
గత ఐదేళ్లల్లో జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లనే జనాలు ఆయన పార్టీకే మద్దతు ఇస్తున్నారని టౌమ్స్ నౌ చెప్పింది. అయితే, ఈ సర్వే ద్వారా వైసీపీ నేతలు, కార్యకర్తల్లో జోష్ నింపేందుకు జగన్మోహన్ రెడ్డే ఇలా చేయించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో టౌమ్స్ నౌకు తగ్గట్లే పరిస్థితులు ఉన్నాయా అంటే.. కచ్చితం లేవు. అలా అసలు అర్థం లేకుండా ఈ సర్వే ఉందని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. అందుకే టౌమ్స్ నౌ సర్వేను పట్టించుకోకుండా.. తమ ప్రయత్నాల్లో తాము ఉన్నారు. ఎందుకంటే టైమ్స్ నౌ సర్వే విడుదలై రెండు రోజులు అయినప్పటికీ, నిన్న కూడా వైసీపీ నుంచి వలసలు భారీగా టీడీపీలో వచ్చాయి.
మరోవైపు, ఈటీజీ టైమ్స్ నౌ సర్వేలో చెప్పిన దాని ప్రకారం.. వైసీపీ, టీడీపీ, జనసేనలు విడివిడిగా పోటీచేస్తే ఆ సీట్లు వస్తాయని చెప్పింది. అసలు ఆ మూడు పార్టీలు విడివిడిగా పోటీచేస్తాయి అన్న ఆలోచనే తప్పు. టీడీపీ – జనసేన కలిసి పోటీచేస్తామని అధికారికంగా మూడు నెలల క్రితమే ప్రకటించారు. అంతకు కొద్ది నెలల ముందు నుంచే పొత్తుతో ముందుకు వెళ్తారనే సంకేతాలు ఉన్నాయి. అలాంటప్పుడు టైమ్స్ నౌ విడివిడిగా పోటీచేస్తే ఈ ఫలితాలు రావచ్చన్నది చెప్పడమే తప్పు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ – జనసేన కలిసి పోటీచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే అంశాన్ని టైమ్స్ నౌ చెప్పలేదు. అందుకే దాన్ని ప్రజలే కాక, వైసీపీ నేతలు కూడా పెయిడ్ సర్వే కింద లెక్కగడుతున్నారు. ఆ పెయిడ్ సర్వేను నమ్ముకుంటే మొదటికే మోసం వస్తుందనే ఆలోచనలో వైసీపీ నేతలు ఉన్నారు.
టైమ్స్ నౌ ఛానల్‌తో ఈటీజీ అనే సంస్థ ఈ సర్వే ఫలితాలు విడుదల చేయగా.. ఆ ఈటీజీ సంస్థతో జగన్ కు దగ్గరి సంబంధమే ఉంది. సీఎం జగన్‌కు ఈటీజీ సంస్థ యజమాని ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్. ఏపీ ప్రభుత్వం తరఫున ఆయన కాంట్రాక్టు ఉద్యోగిగా ఏటా రూ.45 లక్షల జీతం ఆయన పొందుతుంటారు. ఎలాగూ ప్రకటనలతో తమ చెప్పుచేతల్లో పెట్టుకున్న టైమ్స్ నౌ ఛానల్‌తో డీల్ చేసుకొని.. ఈటీజీ, టైమ్స్ నౌ కలిసి.. ఈ ఫేక్ సర్వేను ప్రజలపైకి వదిలాయి.