నిన్న రాత్రి అవనిగడ్డ పై జనసేనాని నినదించారు. కురుక్షేత్ర యుద్ధం అంటున్న జగన్ కు మేం పాండవులం అని గుర్తు చేశారు. కౌరవులు ఏమైయ్యారో చరిత్ర చెబుతోందని చెప్పారు. మూడు విడతల వారాహి యాత్ర ఒక లెక్క.. ఇకమీదట సాగే యాత్ర మరో లెక్క అని చెప్తూ.. అన్నీ లెక్కలు సరిచేస్తాననన్నారు. అలానే వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమని .. ఇక నీకు 175 సీట్లు ఎలా వస్తాయో లెక్కలేసుకోమని సవాల్ విసిరారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును ఎట్టి పరిస్ధితి చీలకుండా ఉండాలనే పొత్తు నిర్ణయం తీసుకున్నామన్నారు. గెలుపే లక్ష్యంగా జగన్ ను ఇంటికి పోవడం ఖాయమన్నారు. జగన్ అవివేక పాలనకు విసుగు పుట్టి రాయలసీమ నుంచి 3 లక్షల కోట్ల కుటుంబాలు వలసపోతున్నారన్నది వాస్తవం. యువతకు ఉపాధిలేక పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. మరో వైపు ప్రభుత్వం ప్రకటించాల్సిన డీఎస్సీని ప్రకటించడం లేదు. వీటిన్నీంటిని పక్కనపెట్టి ప్రశ్నిస్తున్న తనపై కక్ష్యసాధింపుకు దిగుతున్నారని పవన్ వాపోయారు.
సంకీరణ ప్రభుత్వంలో మహిళలకు.., యువతకు.., రైతులకు పెద్దపీట వేస్తామన్నారు పవన్. జగన్ వచ్చే ఎన్నికల్లో 15 సీట్లు రావడం కూడా కష్టమేనని జోష్యం చెప్పాలి. సర్వేలు చెప్తున్న సత్యాలను బుట్టదాఖలు చేసి.. సొంత మీడియాలో వై నాట్ 175 అంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
మొత్తంగా అవనిగడ్డపై పవన్ చేసిన ఘాటు విమర్శలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలో జనసేన వారాహి టూర్ ఫుల్ జోష్ లో సాగేలా కనిపిస్తోంది. టీడీపీ, జనసేన పొత్తుతో మొదటిసారి జిల్లాలో సాగుతున్న యాత్రకు పెద్ద ఎత్తున ఇరు పార్టీలకు సంబంధించిన శ్రేణులు కదులుతున్నాయి.











