తెలుగులో రష్మిక ఓ అరడజను సినిమాలు చేసింది.. వాటిలో నాలుగు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. రష్మిక గ్లామర్.. ఆమె నటన కారణంగా యూత్ లో ఆమె ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. కెరియర్ తొలినాళ్ల నుంచి కన్నడ.. తెలుగు సినిమాలు చేస్తూ వచ్చిన ఆమె, ఇక తమిళ.. హిందీ సినిమాలపై కూడా దృష్టిపెట్టింది. తెలుగులో రష్మికకి గోల్డెన్ లెగ్ అనే ముద్రపడిపోయింది. టాలీవుడ్లో నెంబర్ వన్ ప్లేస్ కోసం పోటీపడుతున్న ఇద్దరిలో ఒకరు పూజా హెగ్డే కాగా, మరొకరు రష్మికనే. అందం.. అల్లరితనం కలిసినట్టుగా కనిపించే రష్మిక జోరు ఒక రేంజ్ లో సాగిపోతోంది.

ప్రస్తుతం రష్మిక చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. తెలుగు.. తమిళ.. కన్నడ.. హిందీ సినిమాలు ఆ లిస్టులో ఉన్నాయి. తెలుగులో ఆమె బన్నీ జోడీగా ‘పుష్ప’ సినిమా చేస్తోంది. ఈ సినిమా వరకూ కోటి రూపాయల పారితోషికం తీసుకున్న రష్మిక, ఆ తరువాత నుంచి తన పారితోషాన్ని పెంచిందనే టాక్ వినిపిస్తోంది. పెంచిన పారితోషికం ప్రకారం ఆమె రెండున్నర కోట్లు తీసుకుంటుందనేది ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న మాట. ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ .. ‘మిషన్ మజ్ను’ సినిమాలకు ఆమె పెంచిన పారితోషికమే తీసుకుందని అంటున్నారు.
ఒక వైపున కన్నడలోను రష్మిక స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది. మరో వైపున తమిళ .. హిందీ భాషల్లోను పాగా వేసే ప్రయత్నాల్లో ఉంది. ఇక తెలుగులో వరుస అవకాశాలు ఉండనే ఉన్నాయి. అందువలన పారితోషికం పెంచడానికి ఇదే అనువైన సమయంగా ఆమెకి అనిపించి ఉండవచ్చు. అందువలన పెంచేసిందని అంటున్నారు. ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలి.. క్రేజ్ ఉండగానే డిమాండ్ చేయాలి అనే విషయాన్ని రష్మిక బాగానే పసిగట్టేసింది. అసలే తెల్లపిల్ల.. తెలివైన పిల్లకదా! ఇటీవలే పూజా హెగ్డే పారితోషికం పెంచినట్టుగా వార్తలు వచ్చాయి.. ఇప్పుడు రష్మిక కూడా పెంచేసినట్టు చెబుతున్నారు. వాస్తవమెంతన్నది వాళ్లు చెప్పే అవకాశం కూడా లేదు.. అసలే డబ్బు మేటర్ కదా!
Must Read ;- మాజీ ప్రియుడుతో టచ్ లోకి వెళ్లిన రష్మిక
https://www.youtube.com/watch?v=ZPwnGINFG_4











