వారికి ఎలాగైనా సరే జగన్ దృష్టిని ఆకర్షించాలన్న కోరిక. అందుకోసం వారు ఎలాంటి దుస్సాహసనికైనా వెనుకాడడం లేదు. కనీసం తాము చేస్తున్న పనేంటో, మాట్లాడుతున్న మాటలు ఏంటో కూడా మర్చిపోయి మరి రెచ్చిపోతున్నారు. వారికి సంబంధం ఉన్న లేకపోయిన అవతలి వారిని ఓ నాలుగు తిట్లు తిట్టేస్తే చాలు. జగన్ అన్న మమ్మల్ని మెచ్చేసుకుంటారు అనే ఆలోచనలో ఉన్న జగనన్న అనుయాయులు చాలా మందే ఉన్నారు.
కొన్నాళ్ల క్రితం ఓ రాజకీయ నాయకుణ్ని చంపిన ఓ వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ‘బావ కళ్లల్లో సంతోషం కోసమే ఈ పని చేశా’ అంటూ తెగ విర్రవీగాడు. ఇప్పుడు అదే బాటలో మన వైకాపా అనుయాయులు కూడా మాకేంటి అన్నట్లు ప్రవర్తించేస్తున్నారు.
ఆ తల పొగరుతోనే న్యాయవ్యవస్థ పైన, హైకోర్టు న్యాయమూర్తులపైన సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టింగులు పెట్టి, చర్చలు జరిపేస్తున్నారు.
తాజాగా అలాంటి 93 మందిని గుర్తించడం జరిగింది. వారిపై సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. అయితే కొంతమంది కౌంటరు దాఖలు చేయడానికి చివరి అవకాశంగా 30 రోజుల గడువు ఇచ్చింది. అయినప్పటికీ కొంతమంది ఇప్పటి వరకు ఎటువంటి కౌంటర్ దాఖలు చేయకపోవడంతో హైకోర్టు విచారణకు సిద్ధమయ్యింది.
ఎందుకు ఇలా చేస్తున్నారు
అసలు వారంతా జగన్ కు తెలుసో లేదో కూడా తెలియదు. సామాన్య కార్యకర్తలు ఎలాగైనా సరే జగన్ దృష్టికి వెళ్లిపోతే తరువాత సంగతి తరువాత చూసుకుందామనకుంటున్నారు. అందుకే అవసరం ఉన్న లేకపోయిన ప్రెస్ మీట్ లతో పాటు సోషల్ మీడియాలో సైతం న్యాయమూర్తులపై, న్యాయ వ్యవస్థ పైన అనవసర పదాలు ఉపయోగించేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తున్నారు.
వీరిలో కొందరు సామాన్య కార్యకర్తలు ఉంటే సాక్షాత్తు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో ఉన్నవారు కూడా అలా న్యాయవ్యవస్థ గురించి మాట్లాడటం శోచనీయం.
ఎవరెవరు ఉన్నారంటే..
ఇష్టారీతిన మాట్లాడేవారిలో సామాన్య కార్యకర్తలు ఉన్నారంటే అనుకోవచ్చు. వారికి న్యాయవ్యవస్థ గురించి ఏమి తెలియదు కాబట్టి అలా మాట్లాడారు అని. కానీ ఇలా సమయం సందర్భం లేకుండా కేవలం జగన్ అన్న చూపు మా మీద పడితే చాలు అనుకునే వారిలో సాక్షాత్తు న్యాయవాదులు, జర్నలిస్ట్ లు వంటి వారు కూడా ఉన్నారు.
నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించరు
కౌంటరు దాఖలు చేసుకోవచ్చని హైకోర్టు కొందరికి నోటీసులు పంపినప్పటికీ అవతలి వ్యక్తి నుంచి ఎటువంటి స్పందన ఉండదు. మీడియా ముందు ప్రగల్భాలు పలికే వారికి కనీసం కౌంటర్ ఎందుకు దాఖలు చేయాలో కూడా తెలియదు. ఇప్పటి వరకు స్పందించని వారికి కోర్టు పత్రిక పరంగా నోటీసులు జారీ చేయాలని గత విచారణలో హైకోర్టు పరిపాలనా విభాగాన్ని ధర్మాసనం ఆదేశించింది.
అలా ప్రకటన జారీ చేసినప్పటికీ కూడా ధిక్కరణ ఎదుర్కొంటున్న 16 మంది విచారణకు హాజరు కాలేదు. న్యాయవాదులను నియమించుకోలేదు. దీంతో విచారణలో పాల్గొనడానికి ఆసక్తి చూపని వ్యక్తులుగా వారిని భావించి కోర్టు ధిక్కరణ విషయంలో ముందుకెళ్లేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.










