నేచురల్ స్టార్ నానీ ఈ ఏడాది సరికొత్త ప్రాజెక్స్ట్ తో బరిలోకి దిగుతున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నటిస్తుండగా.. దీనికి సమాంతరంగా ‘శ్యామ్ సింగ రాయ్’ అనే థ్రిల్లర్ ను కూడా ట్రాక్ లో పెట్టాడు. ఇంకా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికీ..’ అనే ప్రాజెక్ట్ ను సైతం లైన్ లో పెట్టుకున్నాడు. ఇక ముందు గా వీటిలో ‘టక్ జగదీష్’ ను ఫినీష్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు నానీ. గతంలో ‘నిన్నుకోరి’లాంటి లవ్ స్టోరీతో నానీకి మంచి హిట్టిచ్చిన శివ నిర్వాణ… ఈ సినిమాతో నానీని డిఫరెంట్ యాంగిల్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు.
ఫ్యామిలీ వాల్యూస్ , హ్యూమన్ ఎమోషన్స్ ప్రధానంగా సాగే ఈ సినిమా లో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ కథానాయికలు గా నటిస్తున్నారు. ఇంకా రావు రమేశ్, నాజర్, నరేష్ లాంటి సీనియర్ నటులు సైతం ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కుటుంబ సభ్యులు నానీ చుట్టూ చేరి ఏదో ముచ్చటిస్తూ .. ఆనందోత్సాహాలతో ఉన్న ఫోటో ను కూడా విడుదల చేశారు. ఈ పిక్ ప్రస్తతుం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ‘టక్ జగదీష్’ నానీకి ఏ రేంజ్ లో హిట్టిస్తుందో చూడాలి.
Must Read ;- అడ్వకేట్ గా మారిన ‘నేలటిక్కెట్టు’ భామ
#TuckJagadish will be in theatres From April 16 2021 🔥🔥#Nani #ShivaNirvana #RituVarma #aishwaryarajesh
Follow @OTTGURUJINITHIN 👈 For All New Update's👍🏻
pic.twitter.com/nf4rfoLzqm— NEW UPDATES (@OTTGURUJINITHIN) January 9, 2021