విశాఖ వాల్తేరు క్లబ్ భూములకు చాలా పెద్ద చరిత్రే ఉంది. దానిపై గత కొంత కాలంగా వివాదం రాజుకుంది. క్లబ్ భూములు ప్రభుత్వానికి చెందుతాయని అధికారులు వాదిస్తున్నారు. దీనిపై కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. క్లబ్‌కు సంబంధించిన భూములపైహైకోర్టు లో నేడు విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు, క్లబ్ భూములపై సిట్ విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వాల్తేరు క్లబ్ కు సంబంధించిన సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవద్దని సిట్‌ని హైకోర్టు ఆదేశించింది.
Must Read ;- నాలుగు నెలల్లో రాజధాని విశాఖకు తరలింపు: సజ్జల