మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా నిన్న దీక్ష చేపట్టిన టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు గొల్లపూడి టీడీపీ నేత సుబ్బరావు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. గుడివాడలో కోతముక్క పేకాట ఆడిస్తూ మంత్రి కొడాలి నాని రోజుకు రూ.10 లక్షల గుంట బంకినీ తీసుకుంటున్నాడని దేవినేని ఉమ ఆరోపించారు. కోత ముక్క మాఫియా బెదిరింపుల కారణంగానే గుడివాడ టు టౌన్ ఎస్.ఐ విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించే స్థాయి మంత్రి కొడాలి నానికి లేదని ఆయన మండిపడ్డారు.
కేసుల మాఫీకి అమిత్ షా కాళ్లు పట్టుకుంటున్నారు
ఏపీ సీఎం నాలుగుసార్లు ఢిల్లీ వెళ్లి ఏం సాధించారో మీడియాకు వెల్లడించాలని మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. కేవలం సీఎం జగన్ రెడ్డిపై ఉన్న కేసుల మాఫీ కోసమే కేంద్ర హోం మంత్రిని కలుస్తున్నాడని ఆయన ఆరోపించారు. ప్రత్యేకహోదా ఏమైందని ఉమా ప్రశ్నించారు. పోలవరం పనులు పడకేశాయని దేవినేని ఉమ విమర్శించారు. అంతకు ముందు దేవినేని ఉమకు నిమ్మరకం ఇచ్చి దీక్ష విరమింపజేసేందుకు మాజీ మంత్రి జవహర్ గొల్లపూడి చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని జవహర్ విమర్శించారు. ప్రభుత్వ అరాచకాలు ఎక్కువకాలం సాగవని ఆయన హెచ్చరించారు.
Must Read ;- జగన్ పెద్ద డెకాయిట్.. గాలిమీద కూడా పన్నులు పిండేస్తాడు











