సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి అంటేనే మన దేశంలో అత్యున్నత పదవి. అలాంటి పదవి ఓ తెలుగువాడిని వరించడాన్ని సినీ పరిశ్రమ కూడా గర్వంగా భావిస్తోంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కూడా తనదైన శైలిలో స్పందించారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్.వి. రమణ పదవీబాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రత్యేక శుభాభినందనలు తెలిపారు. గత నలభై ఏళ్లుగా న్యాయక్షేత్రంలో నిత్య కృషీవలుడు ఎన్.వి. రమణ అని అభివర్ణించారు.
వ్వవసాయ కుటుంబంలో పుట్టి విద్యార్థి దశ నుంచే రైతుల పక్షాన నిలిచిపోరాడిన రైతు బిడ్డ, సామాన్యుల కష్టం తెలిసిన పాత్రికేయుడు అని రమణను కొనియాడారు. అత్యున్నత న్యాయస్థానం లో అత్యున్నత పదవిని 55సంవత్సరాల తర్వాత చేపడుతున్న ఈ తెలుగు బిడ్డను చూసి ఆయన పుట్టిన ఊరు పులకించిపోతుందని ట్విట్టర్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
Must Read ;- సీజేఐగా రేపు జస్టిస్ ఎన్.వి.రమణ ప్రమాణస్వీకారం : కొద్ది మంది సమక్షంలోనే!
Hearty Congrats to #TeluguPride Sri.#NVRamana garu as he takes oath as Hon'ble Chief Justice of India today Eminent jurist for 40 yrs,reaches pinnacle of his illustrious career.Only 2nd Telugu to earn the glory after 55 long yrs.His motherland is joyous on the momentous occasion pic.twitter.com/EqE8r1m82W
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 24, 2021











