ప్రపంచం మొత్తం కరోనా నియంత్రణపై పోరాటం చేస్తుంటే, ఏపీ సీఎం జగన్ రెడ్డి మాత్రం రాజకీయ పోరులో బిజీగా ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా ఏపీలో కరోనా కేసులు 10 లక్షలు దాటాయని పేర్కొన్నారు. సీఎం జగన్ కరోనా కేసులు పట్టించుకోకుండా రాజకీయ సమీక్షలు చేస్తున్నారని అన్నారు. ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ దొరక్క రోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జగన్ కు ప్రజల ప్రాణాల కన్నా రాజకీయాలపైనే ఎక్కువ ఉన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి కళ్లు తెరిచి కరోనా నివారణకు చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
Must Read ;- ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో జగన్ రాక్షస ఆనందం : నారా లోకేశ్