కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పైపైకి వెళ్తోంది. నిన్న 1,03,770 పరీక్షలు నిర్వహించగా, 7,432 కేసులు నమోదు అయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ ఒక బులిటెన్ విడుదల చేసింది. తెలంగాణలో నిన్న ఒకరోజే 33 మంది చనిపోయారు. 2,152 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 58,148 గా ఉన్నాయి. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
అప్రమత్తంగా ఉండాలి
దేశంలో అక్కడక్కడ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించుకుని అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వేసవి కాలం కావడంతో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. యుద్ధ విమానాలను ఉపయోగించి తీసుకు వస్తున్న ఆక్సిజన్‌ను అవసరం ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్‌కి చేరే విధంగా సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
Must Read ;- వద్దనకున్న ప్లాంటే ‘ఊపిరి’పోస్తోంది : విశాఖ నుంచే తొలి ఆక్సిజన్ రైలు











