కౌన్ బనేగా కరోడ్ పతి… టెలివిజన్ షోలలో ఇదొక సంచలనం. సామాన్యులను కోటీశ్వరులుగా మార్చే అద్భుతమైన షో. దీనికితోడు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ వ్యాఖ్యాత. ఇక ఈ షో రేటింగ్స్ లో అగ్రస్థానం లో కొనసాగుతుందంటే ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ షో నిరాటంకంగా 11 సీజన్లు పూర్తి చేసుకుని 12 వ సీజన్ లోకి అడుగుపెట్టింది. నెల రోజుల క్రితం మొదలైన ఈ షోలో సంచలనం నమోదైంది. దాదాపు 20 ఏళ్ల నుండి ఈ షోకు హాజరుకావాలని ప్రయత్నిస్తున్న ముగ్గురు మహిళలలకు ఈ షోలో అవకాశం దక్కింది. అంతేనా, ముగ్గరూ కోటి రూపాయలు గెలుచుకుని కోటీశ్వరులుగా మారారు. మరి సామాన్యుల నుండి కోటీశ్వరులుగా మారిన వారి ప్రయాణాన్ని మనమూ తెలుసుకుందాం రండి…
నాజియా నజీమ్
రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ లో కమ్యూనికేషన్ మేనేజర్ గా పనిచేస్తున్న నాజియా ఈ కరోడ్ పతి షోలో పాల్గొనడానికి 20 సంవత్సారాలుగా ప్రయత్నిస్తుంది. కానీ ఆమెకు ఎంట్రీకి అవకాశం దక్కలేదు. కానీ, చివరికి 12వ సీజన్ లో ఆమె ప్రయత్నానికి ఫలితం దక్కింది. కేవలం ఎంట్రీ లభించడమే కాదు, 12వ సీజన్ లో మొదటి కోటీశ్వరురాలిగా నిలిచింది. ఆమె ఆటతీరును బిగ్ బీ సైతం ప్రశంసించడం విశేషం.
NAZIA NASIM is #KBC12’s first crorepati ! Watch this iconic moment in #KBC12 on 11th Nov 9 pm only on Sony @SrBachchan@SPNStudioNEXT pic.twitter.com/6qG8T3vmNc
— sonytv (@SonyTV) November 5, 2020
మోహితా శర్మ
హిమాచల్ ప్రదేశ్ లో ఐపీఎస్ అధికారిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది మోహితా శర్మ. చాలా ఏళ్ల తన ప్రయత్నాలు ఫలించి కౌన్ బనేగా లో పాల్గొనడానికి అవకాశం దక్కింది. వచ్చిన అవకాశాన్ని అనుకున్న విధంగా సద్వినియోగం చేసుకుంది లేడీ ఐపీఎస్ ఆఫీసర్. 12 వ సీజన్ లో కోటీశ్వరాలిగా గెలుపొందిన రెండో మహిళగా చరిత్రకెక్కింది. ఈమె భర్త కూడా ఈ షో కోసం 20 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. కానీ, ఇప్పటికీ ఆయనకి పాల్లొనే అవకాశం ఒక్కసారి కూడా రాలేదు.
And we have the second crorepati of season 12! With the help of lifeline, #AskTheExpert and her profound knowledge, Mohita bags 1 Crore. We congratulate her on this historic win. @SrBachchan @SPNStudioNEXT pic.twitter.com/Mk6MrsGC8W
— sonytv (@SonyTV) November 17, 2020
అనుప దాస్
20 ఏళ్లుగా ప్రయత్నిస్తున్న చత్తీస్ గఢ్ టీచర్ అనుప దాస్ కౌన్ బనేగా 12 వ సీజన్ లో మూడో కోటీశ్వరురాలిగా నిలిచింది. ఇందులో గెలిచిన డబ్బును క్యాన్సర్ తో బాధపడుతున్న తన తల్లి చికిత్సను ఉపయోగిస్తానని వెల్లడించింది అనుప. కోటి రూపాయలు గెలిచే ప్రయాణంలో ఆమె ప్రయత్నాన్ని, అలవోకగా సమాధానాలు చెప్పిన విధానాన్ని అమితాబ్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.
ANUPA DAS strived her way to reach the hotseat and answered every question with a confident smile. Watch her become the third crorepati, this Wednesday at 9PM on #KBC12, only on Sony TV. @SrBachchan @SPNStudioNEXT pic.twitter.com/o7KQZjgucF
— sonytv (@SonyTV) November 24, 2020