3 Years For Adivi Sesh Goodachari Movie :
అడివి శేష్ మంచి నటుడు అని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. చిన్న చిన్న పాత్రలు మొదలు ఆయన హీరో స్థాయికి చేరుకున్నాడు. ఈ ప్రయాణం వెనుక ఆయన కృషి, పట్టుదల ఎంతో ఉన్నాయి. కథాకథనాలపై ఆయనకి మంచి పట్టుంది.ఆయన చేసిన సినిమాల్లో ‘గూఢచారి‘కి ప్రత్యేకమైన స్థానం ఉంది. 2018 ఆగస్టు 3వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఆ ఏడాది సూపర్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ రోజుతో ఈ సినిమా మూడేళ్లను పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను గురించి అడివి శేష్ ప్రస్తావించాడు.
“గూఢచారి తెరపైకి వచ్చి అప్పుడే మూడేళ్లు గడిచిపోయాయి. అతను మరో ఆసక్తికరమైన మిషన్ తో మళ్లీ తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాడు. ‘గూఢచారి 2’కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది” అంటూ అడివి శేష్ ట్వీట్ చేశాడు. ‘గూఢచారి’ సినిమాకు అభిషేక్ నామా .. విశ్వప్రసాద్ .. అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా వ్యవహరించారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, శోభిత ధూళిపాళ్ల కథానాయికగా నటించింది. కీలకమైన పాత్రలో జగపతిబాబు కనిపించారు. ప్రస్తుతం అడివి శేష్ చేస్తున్న ‘మేజర్‘ పూర్తికాగానే, ‘గూఢచారి 2’ మొదలుకానున్నట్టు చెబుతున్నారు.
Must Read ;- రవితేజ మూవీతో మరో హీరో రీ ఎంట్రీ!