‘క్షణం, గూఢచారి, ఎవరు’ చిత్రాలతో టాలీవుడ్ లో థ్రిల్లర్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అడివి శేష్. అలాంటి సినిమాలకు శేషే బెస్ట్ అని ఫిక్సయిపోయారు ప్రేక్షకులు. త్వరలో హిట్ 2 తో మరోసారి ఆ పేరు సార్ధకం చేసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో అతడి తాజా చిత్రం ‘మేజర్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథగా ఈ సినిమా రూపొందుతోంది. తెలుగు, హిందీ భాషలతో పాటు మలయాళంలో కూడా మేజర్ విడుదల కాబోతోంది.
జూలై 2న ‘మేజర్’ సినిమా విడుదల కాబోతోంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఇటీవల విడుదలైన మేజర్ సినిమాకు సంబంధించిన లుక్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్ ను ఈ నెల 12న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించిన మేకర్స్.. సినిమా చాలా రియలిస్టిక్ గానూ, ఎమోషనల్ గానూ ఉండబోతోందని చెబుతున్నారు. మరి టీజర్ తో మేజర్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాడో చూడాలి.
#MajorTheFilm releases ACROSS India in
Telugu :: Hindi :: Malayalam#MajorTeaserOnApril12 pic.twitter.com/zEVjkdw7EC— Adivi Sesh (@AdiviSesh) April 9, 2021











