ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించే హీరో అడివి శేష్. ఎక్కువగా యాక్షన్ థ్రిల్లర్స్ పై దృష్టిపెట్టే ఈ హీరో ఇప్పుడు ఓ అమర వీరుడి బయోపిక్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. సినిమా పేరు మేజర్. ఆయన పేరు సందీప్ ఉన్నికృష్ణన్. 26/11 ముంబై లోని తాజ్ ఫ్యాలెస్ హోటల్ పై టెర్రిరిస్ట్స్ అటాక్స్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆ అటాక్స్ లో ఎందరో అమాయకుల్ని తాజ్ హోటల్స్ నుంచి బైటికి తీసుకొచ్చి .. తన ప్రాణాల్ని కోల్పోయాడు మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్.
‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాణ సంస్థ జీయంబీ ఎంటర్ టైన్ మెంట్స్ సహకారంతో.. ఎ ప్లస్ యస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్న కారణంగా.. రియల్ లొకేషన్స్ లోనే సినిమాను చిత్రీకరించా లనుకున్నారు మేకర్స్. మరీ ముఖ్యంగా ఈ సినిమాకి ప్రధాన లొకేషన్ అయిన ముంబై తాజ్ ప్యాలెస్ హోటల్ లో ఈ సినిమాను షూట్ చేయాలనుకున్నారు. అయితే వారి నుంచి నిర్మాతలకు అనుమతి లభించలేదు. అందుకే ఆ ముంబై తాజ్ ఫ్యాలెస్ హోటల్ నే హైద్రాబాద్ కు తీసుకొచ్చారు చిత్ర బృందం. దీని కోసం ఏకంగా ఆరు సెట్స్ నిర్మించారు.
తాజ్ ప్యాలెస్ హోటల్, ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా, యన్.యస్.జీ కమాండో సముదాయాలు తదితర సెట్స్ ను ప్రొడక్షన్ డిజైన్ అవినాష్ కొల్ల నేతృత్వంలో నిర్మించారు. 10రోజుల పాటు 500 మంది కార్మికులు శ్రమించి ఆ సెట్స్ ను రూపొందిదంచారట. ముఖ్యంగా 120 అడుగుల ఎత్తులో ఐదంస్తులతో ఉండే తాజ్ ప్యాలెస్ హోటల్ ఈ సినిమాకే హైలైట్ గా నిలిచిపోతుందని చెబుతున్నారు. మరి మేజర్ మూవీ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాలి.
Must Read ;- అడవి శేష్ ‘మేజర్’ టీజర్ వచ్చేస్తోంది!