Allu Arjun’s Pushpa Movie To Release On Christmas 2021 :
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప’ సినిమా రూపొందుతోంది. అడవి నేపథ్యంలో సాగే ఈ కథలో నాయికగా రష్మిక కనువిందు చేయనుంది. కథాపరిధి విస్తృతంగా ఉండటంతో, ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. మొదటి భాగానికి సంబంధించిన షూటింగు ముగింపు దశకి చేరుకుంది. దాంతో ఈ సినిమాలు ఎప్పుడు విడుదల చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇటు దసరాకి .. అటు సంక్రాంతికి గట్టిపోటీ ఉండటంతో, ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయనున్నారనే కుతూహలం అందరిలో పెరిగిపోతూ వస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను ‘క్రిస్మస్‘ కి రిలీజ్ చేసే అవకాశం ఉందనే టాక్ వచ్చింది .. అదే ఇప్పుడు నిజమైంది. ఈ సినిమాను ‘క్రిస్మస్’ కానుకగా విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ, ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. దాంతో ఇప్పటికీ వరకూ ఊగిసలాటలో ఉన్న అభిమానులకు ఊరట లభించినట్టే అయింది. ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో, అనసూయ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాల్లో, ఒక్కో భాగంలో ఒక్కో ఐటమ్ సాంగ్ ఉండనుందనేది కూడా ఆసక్తికరంగా మారింది.
Must Read ;- అంధుడి పాత్రలో అల్లు అర్జున్.?