కాజల్ కు జీవితంలో ఆరు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఆమె రక్తం పంచుకుపుట్టిన చెల్లెలు. చెల్లి అంటే ఆమెకు అంత ఇష్టమట. ఇక వేసుకునే దుస్తుల విషయంలోనూ ఆమె ప్రత్యేక అభిరుచులు ఉన్నాయి. ఫిట్ నెస్ విషయంలోనూ ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. వీటన్నటి గురించీ ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
1. చెల్లెలు నిషా
నేను నా చెల్లెలు నిషా చాలా క్లోజ్ గా ఉంటాం. అన్నీ షేర్ చేసుకుంటాం. చాలామంది అక్కాచెల్లెళ్లలా మేం కూడా చిన్న చిన్న విషయాలకు పోట్లాడుతుంటాం. మా వార్డ్ రోబ్ లో ఉన్న క్రీములు, కాస్మొటిక్స్ నుంచి ప్రతిది మేం పంచుకుంటాం. ఎప్పుడూ ఒకరి విషయాల్ని ఒకరం షేర్ చేసుకుంటాం. ఆరోగ్యకరమైన జీవన విధానం అంటే మా ఇద్దరికీ ఇష్టం. ఫిట్ నెస్, డైట్ మమ్మల్ని ఎప్పుడూ కలిపి ఉంచుతుంది. టీ సెషన్లు మాకు చాలా ముఖ్యమైనవి. మధ్యాహ్నం టైమ్ లో టేబుల్ దగ్గర కూర్చొని, టీ తాగుతూ, టైమ్ పాస్ చేయడం మాకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు నిషా, తన బాబుతో బిజీ అయిపోయింది. నాక్కూడా పెళ్లయిపోయింది.
2. ఫ్యాషన్ ఎంపిక
ఫ్యాషన్ అనేది మన వ్యక్తిత్వానికి కొనసాగింపు లాంటిది. మన స్కిన్ మనకు ఎంత కంఫర్ట్ గా ఉందనేది ఇంపార్టెంట్. బయట వ్యక్తులకు ఎలా కనిపిస్తామనేది సెకండరీ. అందుకే నేను ఫ్యాషన్స్ విషయంలో గొప్పలకు పోను. నేను జీన్స్, చీరలు ఇష్టపడతాను. అందులో కూడా నలుపు, తెలుపు చాలు. నా వార్డ్ రోబ్ లో ఎక్కువగా నలుపు, తెలుపు, ఎరుపు రంగులే కనిపిస్తాయి మీకు. అదే సమయంలో డిజైనరీ దుస్తుల్ని కూడా నేను ఇష్టపడతాను. అనామిక ఖన్నా, రాహుల్ మిశ్రా, గియాంబట్టిస్టా డిజైన్లను ఇష్టపడతాను.
3. ఫిట్ నెస్ మంత్ర
నేను జిమ్ బఫ్ గా ఉండేదాన్ని. చాలా వెయిట్ ట్రైనింగ్ చేశాను. లాక్డౌన్ అయినప్పటి నుండి, నేను ఇంట్లో ఫంక్షనల్ ట్రైనింగ్ చేయడం మొదలుపెట్టాను. బార్ వర్కౌట్స్, పైలేట్స్ తో 57 కిలోల బరువు మెయింటైన్ చేస్తున్నాను. దీంతో పాటు యోగా సాధన చేస్తాను. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత రెగ్యులర్ జిమ్ వర్కవుట్స్ మొదలుపెట్టాలనుకుంటున్నాను. ఇక ఫిట్ నెస్ లో భాగంగా నా భర్తతో కలిసి నడవడానికి నేను ఇష్టపడతాను. ఇది కూడా ఓ ఫిట్ నెస్ మంత్ర.
4. స్కిన్ అండ్ హెయిర్ కేర్
నేను iS కంపెనీకి చెందిన సౌందర్య ఉత్పత్తుల్ని వాడతాను. ఆ కంపెనీ ఫేస్ వాష్ చాలా బాగుంటుంది.అదే కంపెనీకి చెందిన మేకప్ రిమూవల్ ను కూడా వాడుతుంటాను. ఇక వర్క్ లేనప్పుడు నేను మేకప్ వేసుకోను. జుట్టు సంరక్షణలో భాగంగా నేను హెయిర్ మాస్క్‌లను ఉపయోగిస్తాను. నా జుట్టుకు నూనె పట్టిస్తాను. యోగర్ట్ లో నిమ్మకాయ కలిపి తలకు పట్టిస్తాను. అది చాలా బాగా పనిచేస్తుంది నాకు.
5. బ్యాగ్ లో బ్యూటీ ఉత్పత్తులు
లిప్ బామ్, లిప్ అండ్ చిక్ టింట్, మాయిశ్చరైజర్, నెయిల్ పాలిష్ రిమూవర్, హెయిర్ బ్రష్, హెయిర్ సీరం, కొద్దిగా హెయిర్ ఐరన్.. నా బ్యాగ్ లో ఎప్పుడూ ఉంటాయి.
6. రోజువారీ భోజనం
నేను తినే ప్రతి భోజనంలో పిండి పదార్థాలు, ఫైబర్ అలాగే ప్రోటీన్లు ఉండేలా జాగ్రత్తపడతాను. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కచ్చితంగా గుడ్లు తింటాను. మధ్యాహ్నం భోజనంలో జవార్ రోటీ, వెజటబుల్ సలాడ్, ఫ్రూట్స్ ఉంటాయి. సాయంత్రం ఏదైనా ఫ్రూట్ జ్యూస్ లేదా మిల్క్ షేక్ తాగుతాను. శాండ్ విచ్ తింటాను. రాత్రికి రాజ్మా రైస్, పన్నీరు, పరాటాలు తింటాను. మధ్యమధ్యలో కొబ్బరి నీళ్లు, ప్రొటీన్ షేక్ తాగుతుంటాను. నేను వెజిటేరియన్.
Must Read ;- వేశ్య పాత్రలో చందమామ కాజల్. ఏ సినిమాలో తెలుసా.?