వ్యవసాయ భూముల రక్షణకు ప్రభుత్వం ఎలాంటి కఠిన చట్టాలు అమలుచేసినా.. ధరణి లాంటి పోర్టల్స్ ప్రవేశపెట్టినా.. అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు అంతటా ఉన్నాయి. విధి నిర్వహణలో తహసీల్దార్లు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. అందుకు ఉదాహరణే ఈ ఘటన. రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ.. ఓ మహిళ ఏకంగా తహసీల్దార్ ఆఫీస్ గుమ్మానికి తాళిబొట్టు కట్టి నిరసన తెలిపింది. తాళిబొట్టు తీసుకొని తన భూమి తనకు పట్టా చేయాలని మహిళ నిరసనకు దిగింది. అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా.. స్పందించకపోవడంతో చివరకు చివరకు ఈ నిర్ణయం తీసుకుందామె.
వారసత్వ భూమిని మార్చారంటూ…
సిరిసిల్ల రుద్రంగి మండలం మానాలకు చెందిన మంగ భర్త.. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. మతిస్థిమితి కారణంగా అక్కడే ఉండిపోయాడు. తన మామ నుంచి వారసత్వంగా 1.13 ఎకరాల భూమి రావాల్సి ఉంది. అయితే మంగ మామ, సోదరుడి బంధువుల పేరు మీద పట్టా చేయించాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారసత్వంగా రావాల్సిన భూమిని అన్యాయంగా మార్చారని అధికారులకు మొర పెట్టుకుంది. దాదాపు రెండేళ్లపాటు తహసీల్దార్ కార్యాలయం చుట్టు తిరిగింది. అధికారులు స్పందించకపోవడంతో విసిగిన ఆమె తహసీల్దార్ కార్యాలయానికి గుమ్మానికి తాళిబొట్టు వేలాడదీసింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలెక్టర్ భాస్కర్ స్పందించి, విచారణకు ఆదేశించారు.
Must Read ;- తహసీల్దార్ పై డీజిల్ దాడి











