అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. పెళ్లి చేసుకున్నతర్వాత కాజల్ అగర్వాల్ సినిమాల్లో నటిస్తుందా..? నటించదా..? అనుకుంటే.. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. కమల్ హాసన్ సరసన భారతీయుడు 2 సినిమాలో నటిస్తుంది. చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటిస్తుంది. అలాగే నాగార్జున – ప్రవీణ్ సత్తారు సినిమాలో కూడా నటిస్తుంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజా షెడ్యూల్ త్వరలో స్టార్ట్ కానుంది.
ఈ చిత్రంలో కాజల్ స్పై పాత్రలో నటిస్తుంది. అలాగే వేశ్య పాత్రలో కూడా కనిపిస్తుందని తెలిసింది. నాగార్జున ఇందులో రా ఏజెంట్‌గా నటిస్తున్నారు. ఆయనకు పూర్తి స్థాయిలో సహకారం అందించే పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తుందని.. ఈమె ఎక్కువ భాగం వేశ్యగా.. చివర్లో మాత్రం స్పైగా కనిపించబోతుందని టాక్ వినిపిస్తోంది. తీవ్రవాదుల గుట్టు రట్టు చేయడానికి తన అందచందాలతో వాళ్లను ఆకట్టుకుంటూ.. వాళ్ళతో రొమాన్స్ చేస్తూ అక్కడి రహస్యాలను తన డిపార్ట్మెంట్ కు అందజేసే పాత్ర ఇది అని సమాచారం
ఒక వైపు గూడాచారి, మరో వైపు వేశ్యగా ఈ రెండూ కలిసి ఉన్న పాత్రను పోషించే అవకాశం కాజల్ కి వచ్చింది. ఇందులో నటనకు అవకాశం ఉండడంతో వెంటనే ఓకే చెప్పిందట. మరి.. పెళ్లి తర్వాత వచ్చిన ఈ వేశ్య పాత్రలో కాజల్ ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.
Must Read ;- హారర్ థ్రిల్లర్ తో భయపెట్టనున్న చందమామ











