జెన్నిఫర్ అనిస్టన్, ఏంజెలినా జోలీ.. హాలీవుడ్ లో ఇద్దరూ పెద్ద స్టార్స్. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి
సందేహం అక్కర్లేదు. అయితే వీళ్లతో పాటు ఇంకా చాలామంది హాలీవుడ్ హీరోయిన్లు ఉన్నారు. కానీ వాళ్లను
పక్కనపెట్టి.. జెన్నిఫర్, జోలీ మధ్య మాత్రమే మీడియా పోలిక తెస్తుంది. ఫ్యాషన్, మనీ, అవకాశాలు, అవార్డులు.. ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా వీళ్లిద్దరి మధ్య మాత్రమే పోలిక పెడుతుంటారు. దీనికి కారణం నటుడు బ్రాడ్ పిట్.
ఇప్పుడు చెప్పుకున్న ఈ హీరోయిన్లిద్దరికీ కామన్ మొగుడు బ్రాడ్ పిట్. ముందుగా అనిస్టన్ ను చేసుకున్నాడు. తర్వాత విడాకులిచ్చి జోలీని చేసుకున్నాడు. ఇప్పుడు ఆమెకు కూడా విడాకులిచ్చాడు. అది వేరే విషయం. ఇలా బ్రాడ్ పిట్ కారణంగా జెన్నిఫర్-జోలీ మధ్య పోలికలు తీసేవాళ్లు ఎక్కువయ్యారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు డబ్బు విషయంలో కూడా పోలిక పెట్టడం స్టార్ట్ చేశారు.
జెన్నిఫర్ తో పోలిస్తే జోలీకి వరల్డ్ వైడ్ కాస్త పాపులరిటీ ఎక్కువ. కానీ డబ్బులు మాత్రం జెన్నిఫర్ దగ్గరే ఎక్కువగా ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం జెన్నిఫర్ అనిస్టన్ ఆస్తి విలువ 240 మిలియన్ డాలర్లు. అదే జోలీ విషయానికొస్తే, అనిస్టన్ దగ్గరున్న దాంట్లో సగమే, అంటే 120 మిలియన్ డాలర్ల ఆస్తి మాత్రమే ఉంది. ఈ విషయంలో జోలీపై జెన్నిఫర్ పైచెయి సాధించింది.
అయితే అవార్డుల విషయంలో మాత్రం జోలీదే పైచేయి. జోలీ ఆస్కార్ విన్నర్. అనిస్టన్ దగ్గర మాత్రం ఆస్కార్ లేదు. గోల్డెన్ గ్లోబ్ అవార్డులు జోలీ దగ్గర 3 అంటే.. జెన్నిఫర్ దగ్గర 4 ఉన్నాయి. స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్స్ జోలీ దగ్గర 2 ఉండే.. అనిస్టన్ దగ్గర ఒకటే ఉంది. ఇలా అవార్డుల్లో కూడా ఇద్దర మధ్య పోలిక తెస్తున్నారు చాలామంది.
జెన్నిఫర్ అనిస్టన్ 2సార్లు పెళ్లి చేసుకుంటే, ఏంజెలినా జోలీ 3 సార్లు పెళ్లి చేసుకుంది. జెన్నిఫర్ ఆనిస్టన్ 3 రిలేషన్ షిప్స్ కొనసాగిస్తే.. జోలీ మాత్రం 2 రిలేషన్ షిప్స్ మాత్రమే నడిపించింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ సింగిల్ గానే ఉన్నారు. సరైనోడు దొరికితే పెళ్లిళ్లు చేసుకోవడానికి రెడీ అని ప్రకటించారు.
Must Read ;- స్టార్ హీరోయిన్ల సైడ్ బిజినెస్