భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ భర్తగా మారకు.. బ్యాచిలరూ..షాది మాటే వద్దు గురూ.. ఈ పాట చాలామందికి బ్యాచిలర్స్ కు అతికినట్టుగా సరిపోతుంది. లైఫ్, సంపాదన అంటూ చాలామంది యువకులు పెళ్లిలకు దూరంగా ఉంటున్నారు. పెద్దల పోరు పడలేక పెళ్లికి ఓకే చెబుతున్నారు. మరి పెళ్లంటే.. సంసార బాధ్యతలు, పిల్లలు, వాళ్ల చదువులు.. ఇలా ఎన్నో బాధ్యతలు ఉంటాయి కాబట్టే కొంతమంది పెళ్లి పాట ఎత్తడం లేదు. కానీ కర్ణాటకలోని ఓ యువకుడు ఒకరితో సరిపెట్టుకోకుండా ఇద్దరిని పెళ్లాడటం హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటకలోని కోలారు జిల్లా వేగమడుగు గ్రామంలో రాణెమ్మ, నాగరాజప్ప రైతు దంపతుల కుమార్తెలు సుప్రియ, లలితలు. చిన్న అమ్మాయి లలిత మూగ అమ్మాయి. ఈ నేపథ్యంలో అక్క సుప్రియకు పెళ్లి ఖారరైంది. వరుడు సుప్రియ మెడలో తాళి కడుతుండగా, తన చెల్లిని కూడా పెళ్లి చేసుకోవాలని మొండికేసింది. ఎంత వారించినా వినలేదు. దీంతో వరుడు.. ఒకే ముహూర్తానికి అక్కాచెల్లిని పెళ్లాడాడు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరిని పెళ్లాడిని ముద్దుల మొగుడు అని ట్రోల్ చేస్తున్నారు.
Must Read ;- ఆన్‌లైన్‌లో ఆశీర్వదించి.. కట్నాలు గూగుల్ పే చేయండి : నెట్టింట్లో లగ్న పత్రిక వైరల్











