ముంబైలో బుధవారం రాత్రి ఓ నివాస భవనం కూలి తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మరో ఎనిమిది గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మలాడ్ వెస్ట్ ప్రాంతంలోని న్యూకలెక్టర్ కాంపౌండ్‌లోని నివాస భవనం కూలడంతో సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మహిళలు, పిల్లలు సహా మరో 15 మందిని రక్షించి ఇతర ప్రాంతాలకు తరలించారు. సమీపంలో ఉన్న రెండు భవనాలు శిథిలావస్థలో ఉండటంతో అందులో ఉంటున్న వారిని ఖాళీ చేయించి కూల్చివేసినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. భవనం శిథిలాల తొలగింపు పనులు జరుగుతున్నాయన్నారు.
Must Read ;- పాక్ లో ఘోర రైలు ప్రమాదం : 30 మంది దుర్మరణం, మరికొందరికి గాయాలు










