April 23, 2026 4:25 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

26 ఏళ్లకే ఎమ్మెల్యే.. 46 ఏళ్ల ప్రజా జీవనం..!! అలుపెరుగని ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు..!!

March 16, 2024 at 7:49 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

విద్యార్ధి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నారు. విద్యార్థి నాయకుడినుంచి రాష్ట్ర పరిపాలనా సారధి వరకు ఎదిగారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. దేశ రాజకీయాల్లో సైతం కొంత కాలం కీలక పాత్ర పోషించారు.. దేశ ప్రధానుల ఎంపికలో.. అలాగే రాష్ట్రపతుల ఎంపికలోనూ తన మార్క్‌ రాజకీయాలను ప్రదర్శించారు. ఆయనెవరో కాదు 26 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికై.. 28 ఏళ్ల చిన్న వయస్సులోనే మంత్రిగా కొనసాగి.. 46 ఏళ్లపాటు ప్రజా జీవితం కొనసాగిస్తున్నారు. ఏడు పదుల వయస్సులోనూ యువకులకు ధీటుగా కొనసాగుతున్నారు. ఆయనెవరో కాదు.. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నేటితరానికి ఆయన మార్గదర్శి.. సరికొత్త లక్ష్యాలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుగుజాతికి అందించిన దార్శనికుడు. జాతి నిర్మాణంవైపు ప్రజల్ని జాగృతం చేసిన నేత. 46 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో అద్భుతమైన విజయాలను, మరెన్నో ఆటుపోట్లు చవిచూసినా చెక్కు చెదరని గుండె నిబ్బరం, మనోధైర్యం చంద్రబాబు సొంతం. ప్రజాజీవనంలో ఆ నాయకుడి నిర్విరామ ప్రయాణానికి నేటితో నిండా 46 ఏళ్లు నిండాయి. ఎదురు దెబ్బలు పాఠాలుగా, గాయాలు గుణపాఠాలుగా, సమస్యలు, సంక్షోభాలే సానుకూలావకాశాలుగా మార్చుకొనే అసిధారావ్రతుడు. నిరాశా నిసృహలను దరిచేరనివ్వని ఆశావాహుడు… గెలుపోటములకు స్థితప్రజ్ఞడు.. నిర్విరామయోధుడు, అలుపెరుగని ధీరుడు.

విద్యార్ధి దశనుండే నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకొన్న చంద్రబాబు.. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి గెలుపొంది.. 1978 మార్చి 15న శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు నాయుడు చట్టసభలోకి అడుగుపెట్టి నేటికి 46 ఏళ్లు పూర్తయింది. చంద్రబాబు రాజకీయ జీవితం వడ్డించిన విస్తరి కాదు. రాజకీయాల్లోకి వారసత్వంగా వచ్చిన వాడు అంతకంటే కాదు. సాధారణ వ్యక్తిగా వచ్చి మహోన్నత శక్తిగా ఎదిగిన చరిత్ర ఆయనది. కాంగ్రెస్‌ ఆదేశం మేరకు చంద్రగిరి నుండి పోటీ చేసి ప్రజల్లో గుర్తింపు పొందిన జనతా పార్టీ అభ్యర్ధి పట్టాభిరామచౌదరిని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. యువ నాయకుడిగా శాసనసభలో ప్రవేశించడమే గాకుండా.. 28 ఏళ్ల వయస్సులోనే అంజయ్య కేబినెట్‌లో 1980 అక్టోబర్‌ 11న గ్రంథాలయాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా తరువాత 1982 ఫిబ్రవరి 24న భవనం వెంకట్రామ్‌ కేబినెట్‌లో చిన్న నీటి పారుదల శాఖామంత్రిగా కొనసాగారు. 1982 సెప్టెంబర్‌ 20న కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కేబినెట్‌లోనూ సాంకేతిక విద్యా శాఖామంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 1983లో జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీనుండి పోటీ చేసి అప్పటి తెలుగుదేశం ప్రభంజనంలో ఓటమి పాలయ్యారు. 1983లో ఎన్టీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. సహచరుల వత్తిడి మేరకు, ప్రజలకు మరింత సేవచేసే యోచనతో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పటి వరకు పార్టీలోనే కొనసాగుతూ గత 30 ఏళ్లుగా పార్టీని నడిపిస్తున్న ధీరోదాత్తుడు చంద్రబాబు నాయుడు.

ఏడు పదులు దాటిన వయస్సులో.. 46 ఏళ్ల ప్రజాజీవితం ఆయనది. మూడు దఫాలు మంత్రిగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగి.. మరో పదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నారు. 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్రకు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి.. ప్రస్తుతం ఐదేళ్లుగా ప్రతిపక్ష నాయకుడుగా కొనసాగుతున్నారు. ఇంత సుదీర్ఘకాలం ప్రజా నాయకుడిగా ఆయనతో పోల్చ దగ్గ నాయకుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేరు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, విలువలతో కూడిన నియమబద్ధమైన జీవనశైలి ఆయనది. భావితరాల శ్రేయస్సు కోసం, నిరంతర ఆలోచనలతో, విన్నూత్న ప్రణాళికలు రూపొందించడంలో ఆయనకు ఆయనే సాటి. తన దార్శనికతతో తెలుగుజాతి భవితను తీర్చిదిద్దడమే కాకుండా సరికొత్త విధానాలతో నవ్య చరిత్రకు నాంది పలికి దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. చంద్రబాబు నాయుడు విద్యార్ధి నాయకుడి నుంచి రాష్ట్ర పరిపాలనా సారధి వరకు.. దేశ, రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలనుకొనే వారికి ఆయన ఒక పాఠ్యపుస్తకమని చెప్పాలి. కఠోర శ్రమ, అకుంటిత దీక్షకు చెరగని చిరునామా ఆయన. గాంధీజీ ఆశయాలను ఆలంబనగా చేసుకొని ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్‌టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవ చిహ్నమైతే.. చంద్రబాబు నాయుడు తెలుగువారి ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచారు.

46 ఏళ్లుగా తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన ప్రజా నాయకుడు. అన్ని రాజకీయ పక్షాల వైఖరికి భిన్నంగా పరిపాలన చేసి.. తన విజన్‌తో అభివృద్ధికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు. ఏడు పదులు దాటిన వయస్సులోనూ నవ యువకులు కన్నా అధికంగా పని చెయ్యడం చంద్రబాబు ప్రత్యేకత. అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కొద్దిమందిలో చంద్రబాబు ఒకరు. 1995 సెప్టెంబర్‌ 1న ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా.. అనతి కాలంలోనే ఘన విజయాలను సాధించారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజలవద్దకు పాలన తదితర కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ని పాలించిన ముఖ్యమంత్రులలో చంద్రబాబుది ప్రత్యేకమైన స్థానం. రాజకీయమంటే అధికారం కోసం ప్రాకులాడటం కాదని.. రాజకీయమంటే ప్రజలకు సేవ చేసే అవకాశం పొందటమని విశ్వసించే వ్యక్తి చంద్రబాబు.

జాతీయ రాజకీయాలను కూడా చంద్రబాబు ప్రభావితం చేశారు. యునైటెడ్‌ ప్రంట్‌ ఏర్పాటు, ఆ తర్వాత ఎన్డీఏ ఏర్పాటుకు అంకురార్పణ చేసినవారిలో చంద్రబాబుది కీలక పాత్ర ఉంది. ఒకానొక దశలో ఆయన్ని ప్రధాని కావాలని పార్టీలన్నీ కోరినా.. తాను రాష్ట్రానికే అంకితమని స్పష్టం చేసిన ప్రజా నాయకుడు. దేశ ప్రధానుల నియామకంలో రెండుసార్లు ముఖ్యపాత్ర వహించారు. రాష్ట్రపతులుగా కెఆర్‌ నారాయణయన్‌, అబ్దుల్‌ కలాంను ప్రతిపాదించటంలో ముఖ్య భూమిక పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్దికి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు యావత్‌ భారతదేశాన్నేకాక, ప్రపంచ ఆర్థిక నిపుణులనూ ఆకర్షించాయి.

జంట నగరాలకుతోడు సైబరాబాద్‌ అనే నగరాన్ని సృష్టించి ఆంధ్రుల రాజధానికి ప్రపంచపటంలో గుర్తింపు తెచ్చారు. విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు వల్ల ఎంతోమంది యువతీ యువకులు విదేశాల్లో స్థిరపడి ఉన్నత స్థానాల్లో నిలబడేలా చేసింది. హైదరాబాద్‌లో బిజినెస్‌ స్కూలు, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఏర్పాటు.. రోడ్ల విస్తరణవంటి కార్యక్రమాలతో రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టించారు. 2019 ఎన్నికల్లో ఓటమి చెంది ప్రతిపక్ష స్థానంలోకి వచ్చినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా గడిచిన ఐదేళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఏడు పదులు దాటిన వయస్సులోనూ ప్రజల పక్షాన అలుపెరుగని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ.. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తన వయసును, ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా నిత్యం ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. అందుకే 46 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి చట్టసభలోకి అడుగుపెట్టి జాతికోసం, ప్రగతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రజా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న రాజకీయ నాయకుల్లో 1978 నుంచి రాజకీయాల్లో ఉన్న నాయకులు నిరంతరాయంగా కొనసాగుతున్న వారు ఎవరు లేరు. తనతోపాటు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూడా ఒకేసారి రాజకీయాల్లో వచ్చారు. కానీ ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ లేరు.

Tags: ap politicsChandrababu NaiduChandrababu Naidu Rulingchandrababu naidu visionleonewsleotopLife storyTDP Visionary Leader Chandrababu Naidu Political Life Story
Previous Post

ఉద్యోగులకి జగన్‌ మరో ట్రాప్‌.. ఈసారి మరో గొయ్యి తొవ్వుతున్న వైసీపీ??

Next Post

వాలంటీర్లపై వేటు మెడపై ఈసీ కత్తి..!! వార్నింగ్‌లతో మంటలు..!!

Related Posts

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పని తక్కువ.. ప్రచారం ఎక్కువ : కడప బస్‌ స్టేషన్‌కు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు!

జగన్‌ది ఉప్మా సర్కార్‌..!!

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

తవ్వేకొద్దీ దుర్గగుడిలో అక్రమాలు.. విజిలెన్స్ షాక్

Stunning Hot beauty Ketika Sharma Latest Photos

టైమ్ వస్తే చెలరేగిపోవల్సిందేనంటున్న అందాలరాశి 

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

క్లాస్‌ అండ్ మాస్‌.. చంద్రబాబు ట్రెండ్ సెట్టర్..!

‘ఉప్పెన’లో రాయనం పాత్ర ఇక హాట్ టాపిక్  

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist