జగన్ హయాంలో ఏపీలో గంజాయి, డ్ర*గ్స్ దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగింది. దేశంలోని ఏ రాష్ట్రంలో గం*జాయి దొరికిన దాని మూలాలు ఏపీలో ఉండేవి. ఐతే తాజాగా తిరుపతి ఎంపీ, వైసీపీ నేత గురుమూర్తి దగ్గర పని చేసిన గన్‌మెన్ హైదరాబాద్ లో డ్ర*గ్స్ దందా చేస్తూ దొరికిపోయాడు. తన బామమరిది పెళ్లి పేరు చెప్పి లీవ్ తీసుకున్నాడు. నిజానికి పెళ్లి లేదు, ఏం లేదు. డ్ర*గ్స్ దందా కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ పోలీసులకు దొరికిపోయాడు. ఆయన పేరు గుణశేఖర్. ఏకంగా రెండు కోట్ల రూపాయల విలువైన డ్ర*గ్స్ ను ఆయన గ్యాంగ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు.
కానిస్టేబుల్ గుణశేఖర్ పేరుకు మాత్రమే కానిస్టేబుల్. గుణశేఖర్ గురుమూర్తి, పెద్దిరెడ్డికి బాగా దగ్గర . ఎంతగా ఉంటే గుణశేఖర్ తల్లి జడ్పీటీసీ సభ్యురాలు. తండ్రి ఎంపీటీసీ. ఆ స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చారంటే ఖచ్చితంగా వైసీపీ బ్రాండ్ లో తెర వెనుక ఏదో ఉండి ఉంటుంది. అదేమిటంటే..ఈ డ్ర*గ్స్ దందా అన్న మాట. వైసీపీ పెద్దలే పెద్ద గంజాయి, డ్ర*గ్స్ ముఠాలను నడుపుతారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటివి జరిగినప్పుడు.. ఆ ఆరోపణల్లో నిజం ఉందేమో అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
840 గ్రాముల కొకైన్ బాపట్ల జిల్లా అద్దంకి నుంచి కూకట్‌పల్లికి తీసుకువచ్చినట్లుగా గుర్తించారు. ఈ డ్రగ్స్ వారికి అద్దంకిలో ఎవరిచ్చారు..ఆ ముఠా ఏంటి అనేది హైదరాబాద్ పోలీసులు వెలికి తీయాల్సి ఉంది. కానిస్టేబుల్ దొరికిపోయినట్లుగా సమాచారం రాగానే..గురుమూర్తి ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఆ కానిస్టేబుల్ తన వద్ద గన్‌మెన్‌గా లేడని..తన ప్రమేయం ఉంటే విచారణ చేయాలని సీబీఐకి లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు. కానిస్టేబుల్ దొరికిన వెంటనే గురుమూర్తి భుజాలు తడుముకోవడం ఆశ్చర్యం.











