టాలీవుడ్ లో విజయవంతమైన సినిమాల్ని అందించిన దర్శకుడు గుణశేఖర్. అనుష్క తో ‘రుద్రమదేవి’ తీసిన తర్వాత ఇంతవరకూ మరో సినిమా తెరకెక్కించలేదు. భారీ సెట్స్ వేయడంలోనూ, భారీ కేస్టింగ్ ను సెట్ చేయడంలోనూ చెయితిరిగిన గుణశేఖర్ .. ఈ లాక్ డౌన్ టైమ్ ను .. తన తదుపరి చిత్రమైన పౌరాణిక ఘట్టం ‘హిరణ్యకశ్యప’ ప్రీప్రొడక్షన్ వర్క్ కోసం కేటాయించాడు. ఈ ఏడునెలల్లోనూ వచ్చిన గ్యాప్ ను దానికోసం సద్వినియోగం చేసుకున్నాడు. ఇప్పుడు ప్రీప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయినట్టు గుణశేఖర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
అంతేకాదు.. తాను చేయబోయే తదుపరి చిత్రానికి సంబంధించిన అప్టేడ్ ను ఈ సాయంత్రం 7.11 నిమిషాలకు ఇవ్వబోతున్నట్టు ట్వీట్ చేశాడు. రానా టైటిల్ రోల్ పోషిస్తోన్న ‘హిరణ్య కశ్యప’ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ వారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్నారు. ‘భక్త ప్రహ్లాదుడు’ తన తండ్రైన హిరణ్య కశ్యపుణ్ణి .. నరసింహా వతారంలో ఉన్న విష్ణుమూర్తి చేత వధింపచేసే ఘట్టాన్ని హిరణ్య కశ్యపుడి కోణంలో ఆవిష్కరించబోతున్నాడు గుణశేఖర్.
కళ్ళు చెదిరే సెట్స్ తోనూ, గ్రాఫిక్స్ మాయాజాలంతోనూ రూపొందనున్న ఈ సినిమాని అత్యంత భారీగా నిర్మించబోతున్నారు. అలాంటి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి చాలా టైమ్ పట్టేలా ఉంది. అందుకే ఆ సమయాన్ని గుణశేఖర్ మరో సినిమా కోసం కేటాయించనున్నాడట. మరి గుణశేఖర్ చేయబోయేది ఏ తరహా చిత్రమో తెలియాలంటే.. సాయంత్రం వరకూ వెయిట్ చేయక తప్పదు.
Here comes a big surprise to all our followers! Stay tuned for the announcement at 7:11pm Today! #Gunasekhar #GunaaTeamworks pic.twitter.com/rMnN2R2IxL
— Gunaa Teamworks (@GunaaTeamworks) October 9, 2020











